newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

ఆ 18 సీట్లలో హోరాహోరీ ఖాయం

14-03-201914-03-2019 07:21:34 IST
Updated On 14-03-2019 11:13:45 ISTUpdated On 14-03-20192019-03-14T01:51:34.376Z14-03-2019 2019-03-14T01:46:39.445Z - 2019-03-14T05:43:45.061Z - 14-03-2019

ఆ 18 సీట్లలో హోరాహోరీ ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2014 ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీల మధ్య పోరు నెక్ టూ నెక్ పోరు నడిచింది. కొన్ని చోట్ల చాలా తక్కువ మెజారిటీతో ఫలితాలు వెలువడ్డాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి వైసీపీ నేత కంబాల జోగులు కేవలం 512 ఓట్లతో విజయం సాధించారు. అలాగే పాలకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ నేత కలవటి విశ్వేశ్వరయ్య 1620 ఓట్లతో గెలిచారు. అటు విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి టీడీపీ నేత కే.ఎన్.ఎస్. రాజు 612 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఫలితం అప్పట్లో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ రేపింది.

ఇక తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1512 ఓట్లతో గెలిస్తే, కొత్తపేట సీటును 714 ఓట్లతో వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి సొంతం చేసుకున్నారు. ఇటు కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నేత కొక్కిలిగడ్డ రక్షణనిధి 1919 ఓట్లతో గెలిస్తే, పామర్రు నుంచి నుంచి కూడా వైసీపీ నేత ఉప్పులేటి కల్పన 1059 ఓట్ల మెజార్టీతో, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి శ్రీరాం రాజగోపాల్ 1840 ఓట్లతో విజయం సాధించారు.

అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఫలితం జనంలో నరాలు తెగే టెన్షన్ పెట్టింది. ఈ సీటు నుంచి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో విజయం సాధించారు. అటు సత్తెనపల్లి అసెంబ్లీ సీటులో కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు 924 ఓట్లతో గెలిచారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి నుంచి మంత్రి శిద్దా రాఘవరావు 1687 ఓట్లతో గెలిస్తే... సంతనూతలపాడు సీటు నుంచి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ 1247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అలాగే కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ నేత కే. శ్రీనివాసులు 1915 ఓట్లతో, కర్నూలు జిల్లా ఆలూరు సీటు నుంచి వైసీపీ నేత జయరాములు 1986 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి మంత్రి కాల్వ శ్రీనివాసులు 1827 ఓట్లతో, కదిరి నుంచి వైసీపీ నేత చాంద్ భాషా 780 ఓట్లతో గెలిచారు. ఇక చిత్తూరు జిల్లాలోని నగిరి సీటు నుంచి 858 ఓట్లతో రోజా, పూతలపట్టు సీటు నుంచి వైసీపీ నేత సునీల్ కుమార్ 902 ఓట్లతో గెలిచారు.

2014లో జగన్ పార్టీని టీడీపీ, బీజేపీ, పవన్ కలిసి కట్టుగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఓట్ బ్యాంక్ అప్పట్లో టీడీపీకి ఫేవర్ అయింది. ఇప్పుడు తన సొంత ఓట్ బ్యాంకుతో పాటు టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా కలిస్తే... ఈ 18 సీట్లలో కనీసం 10 సీట్లను గెల్చుకోవడం ఖాయమని జనసేన భావిస్తోందట. అందుకే ఈ స్థానాల్లో సామాజిక, ఆర్థిక అంశాలు తెల్సుకుని తన పార్టీ నుంచి బలమైన నేతను బరిలో దింపాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle