newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

‘‘ఆ సంగతి ఆయన్నే అడగండి’’ పురందేశ్వరి

29-10-201929-10-2019 16:21:28 IST
2019-10-29T10:51:28.854Z29-10-2019 2019-10-29T10:51:21.108Z - - 14-11-2019

‘‘ఆ సంగతి ఆయన్నే అడగండి’’ పురందేశ్వరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కీలక విషయాలు వెల్లడించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని, ఇప్పుడు తనను వైసీపీలో చేరాలని ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు పురందేశ్వరి. వైసీపీలో చేరడానికి ముందు తన భర్త తన రాజకీయ ప్రస్థానం గురించి వైసీపీ నేతలకు వివరించారని చెప్పారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని ఆ పార్టీ నేతలకు తన భర్త చెప్పారన్నారు. 

అందుకు వైసీపీ నేతలు అంగీకరించిన తరువాతే తన భర్త,  కుమారుడు ఆ పార్టీలో చేరారని వివరించారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావునే అడగండి అని బదులిచ్చారు పురందేశ్వరి. భర్త, కొడుకు వైసీపీలో, భార్య బీజేపీలో ఉండడం ఏంటని వైసీపీ నేతలే విమర్శిస్తున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే... బీజేపీలోని ఉన్న పురంధేశ్వరిని పార్టీలోకి తీసుకుని రావాలని సీఎం జగన్ దగ్గుబాటి కుటుంబంపై వత్తిడి పెంచుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరోవైపు బీజేపీ నేతలు పురందేశ్వరికి త్వరలో కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. దీంతో దగ్గుబాటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని దీనిపై వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్లోనే తన నిర్ణయాన్ని చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ సంగతినే ప్రస్తావిస్తే పురందేశ్వరి పై విధంగా స్పందించారు. మొత్తం మీద పురందేశ్వరి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మరి దగ్గుబాటి వైసీపీని వీడతారా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle