newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఆ సంగతి ఆయనకు ముందే తెలుసా?

04-04-201904-04-2019 09:28:32 IST
Updated On 09-07-2019 12:16:51 ISTUpdated On 09-07-20192019-04-04T03:58:32.171Z04-04-2019 2019-04-04T03:57:57.687Z - 2019-07-09T06:46:51.869Z - 09-07-2019

ఆ సంగతి ఆయనకు ముందే తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీటీడీ చైర్మెన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో ఐటీ శాఖకు ఏం దొరికిందోగానీ.. వివాదాల కోసమే కాచుకొని కూర్చొనే సీఎం రమేష్ మాత్రం విమర్శలు చేశారు. ఐటీ అధికారులు ఏ విషయమూ తేల్చకముందే అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు సీఎం రమేష్. పుట్టా సుధాకర్ కంటే ముందుగా ఆయన ఇంటికి చేరుకొని కావాలనే, కక్షపూరితంగా కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని తిట్టిపోశారు. ఇప్పుడే మీడియా ముందు మీరు ఎంత డబ్బు పట్టుకున్నారో చెప్పాలంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు.

కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే వెంటతెచ్చుకున్నఅధికారులు ఎన్నికల సమయంలో ఆగ్రహావేశాలు ప్రమాదానికి దారితీస్తాయేమోనని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇదే విషయంపై చంద్రబాబు వెను వెంటనే స్పందించారు. ఐటీ దాడులు కావాలనే చేయిస్తున్నారంటూ కేంద్రాన్ని తిట్టిపోశారు.

బుధవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సోదాలు నిర్వహించాయి. అయితే.. ఆ సమయంలో పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కడప కేంద్రం నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్‌ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. 

ఐటీ, ఈడీ పేరుతో టీడీపీ నేతల్ని బెదిరిస్తే తాము భయపడేది లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ కాంట్రాక్టర్. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి స్వయానా వియ్యంకుడు. వరుసగా టీడీపీ నేతలపై దాడులు జరుగుతుండటంతో డబ్బు విషయంలో ఎక్కడికక్కడ ముందే సెట్ చేశారు. అందుకే సుధాకర్ ఇంట్లో ఏమీ దొరకలేదు. ఐటీ అధికారుల రాక గురించి ఆయనకు ముందే తెలుసని.. ఏమీ దొరకకుండా జాగ్రత్తపడ్డారని అంటున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle