newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

18-10-201918-10-2019 14:27:44 IST
Updated On 18-10-2019 14:40:11 ISTUpdated On 18-10-20192019-10-18T08:57:44.634Z18-10-2019 2019-10-18T08:57:43.196Z - 2019-10-18T09:10:11.969Z - 18-10-2019

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. మీడియాపై ఆంక్షల విషయంలో వైఎస్ బెస్ట్ అన్నారు చంద్రబాబు.

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఫిబ్రవరి 20న జీవో నెంబర్ 938 ద్వారా మీడియా మీద ఆంక్షల దిశగా నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. అయితే, జర్నలిస్టు సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు..ప్రతిపక్ష నేతగా తాను చేసిన పోరటానికి భయపడి నాడు వైయస్సార్ వెనుకడుగు వేసి..ఆ జీవోను రద్దు చేసారని చంద్రబాబు వివరించారు. ఇందు కోసం వైయస్సార్ ను అభినందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

నెల్లూరులో మైనారిటీ వర్గానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టును వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. నడిరోడ్డుపై నరికేస్తానని హెచ్చరించారు.వైసీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేసిన జర్నలిస్టులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, అప్పుడు మీరెవరూ యూనియన్ అంటూ వారిని వెనకేసుకు రావొద్దని విశాఖలో ఏపీడబ్ల్యుజే సమావేశంలోనే వైకాపా నేత వార్నింగ్ ఇచ్చారన్నారు.

నెల్లూరులోనే జమీన్‌రైతు వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌పై అధికార పార్టీ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరగణంతో దాడికి పాల్పడ్డారు.చీరాల నియోజకవర్గం వేటపాలెంకు చెందిన విలేకరి నాయుడు నాగార్జునరెడ్డిపై వైకాపా నేత అనుచరులు దాడి చేసి హత్యాయత్నం చేసారు.  తూర్పు గోదావరి జిల్లా తొండంగి అర్బన్‌ మండలం ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణను వైకాపా నేత హత్య చేయించారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేస్తూ..., ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని, నాలుగునెలల కాలంలో సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చంద్రబాబు విమర్వించారు. తామేంచేసినా రాయటానికి వీల్లేదన్నట్లు మీడియాని బెదిరిస్తున్నారన్నారు. డబ్బులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని దీనిపై ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలన్నారు. 

ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తూ...., అర్హులకు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారు. అసమర్థతతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి..., గత ప్రభుత్వ తప్పిదం అంటూ మనపై నిందలు మోపుతున్నారన్నారు చంద్రబాబు.

తెలుగుదేశం ఐదేళ్ల పాలన మొత్తం అవినీతి అని ఐదునెలల నుంచి వెతుకుతూ ఏమీ నిరూపించలేకపోయారన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, సంపదసృష్టిపై ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఖర్చు మాత్రం ఇష్టానుసారం చేస్తూ పోతున్నారు. ఇది ప్రజలకు మంచిది కాదన్నారు. జగన్ గారికి నిజం మాట్లాడితే ఎందుకు నచ్చట్లేదు? ఏమిటీ నియంతృత్వం?అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle