newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఆ ర‌కంగా బుజ్జ‌గిస్తున్న జ‌గ‌న్‌

14-06-201914-06-2019 07:37:18 IST
Updated On 22-06-2019 16:40:57 ISTUpdated On 22-06-20192019-06-14T02:07:18.126Z14-06-2019 2019-06-14T02:06:59.988Z - 2019-06-22T11:10:57.550Z - 22-06-2019

ఆ ర‌కంగా బుజ్జ‌గిస్తున్న జ‌గ‌న్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ వైపు ప‌ద‌వులు వ‌దిలి త‌న‌తో న‌డిచిన వారు.. మ‌రో వైపు సీనియ‌ర్ ఎమ్మెల్యే.. అన్నింటికంటే ముఖ్యం సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు. దీంతో మంత్రివ‌ర్గ కూర్పు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు పెద్ద చిక్కులో తేస్తాయ‌ని అంతా అనుకున్నారు.

ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెల‌వ‌డం, అందులో సుమారు స‌గం మంది మంత్రి ప‌ద‌వులు ఆశించ‌డంతో పోటీ తీవ్రంగా నెల‌కొంది. మంత్రివ‌ర్గ ఏర్పాటులో చాలామంది మంత్రి ప‌దవులు ఖాయ‌మ‌నుకున్న వారికి చుక్కెదురైంది.

బ‌య‌ట ఎక్క‌డా అసంతృప్తి క‌నిపించ‌కున్నా లోలోన మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌క అసంతృప్తికి గుర‌య్యారు. దీంతో ఇత‌ర ప‌ద‌వుల ద్వారా వారిని బుజ్జ‌గించేందుకు, న్యాయం చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. విప్ ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌ద‌వుల‌తో పాటు కొత్త‌గా ప‌ద‌వులు సృష్టించి మ‌రీ ఎమ్మెల్యేల‌కు కట్ట‌బెట్ట‌నున్నారు.

వైసీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా ఉన్న రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నుకున్నా ల‌భించ‌క‌పోవ‌డంతో ఆమె కొంత అల‌క‌బూనారు. త‌ర్వాత జ‌గ‌న్ ఆమెతో మాట్లాడి నామినేటెడ్ ప‌ద‌వుల్లో కీల‌క‌మైన ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇక‌, త‌నతో ముందునుంచీ న‌డుస్తున్న ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డికి చీఫ్ విప్ ప‌ద‌వి, కాపు రాంచంద్రారెడ్డి, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, కోర‌ముట్ల శ్రీనివాసులు, సామినేని ఉద‌య‌భాను, దాడిశెట్టి రాజాల‌ను జ‌గన్ నియ‌మించారు.

ఇక‌, ఇప్పుడు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేక‌పోయిన మ‌రికొంత‌మంది ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధి కోసం జ‌గ‌న్ ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేశారు. ఐదు బోర్డుల‌ను ఏర్పాటు చేసి వీటికి ఛైర్మ‌న్లుగా ఐదుగురు ఎమ్మెల్యేల‌ను నియ‌మించారు.

సీనియ‌ర్లుగా, ముందునుంచీ జ‌గ‌న్ తో ఉంటున్న పార్థ‌సార‌థి, అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, దాడిశెట్ది రాజా వంటి వారిని నియ‌మించారు. వీరితో పాటు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ సీనియ‌ర్ నేత‌కు ఈ ఐదు ప్రాంతీయ బోర్డుల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంది. 

ఇక‌, సీఆర్డీఓ ఛైర్మ‌న్‌గా రాజ‌ధాని ప్రాంతంలోని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని నియ‌మించ‌నున్నారు. ఈ ఐదుగురూ మంత్రి ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డ్డవారే. ఇలా మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేక‌పోయిన వారిని జ‌గ‌న్ ఈ ర‌కంగా న్యాయం చేస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle