newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఆ రెండు వర్గాలు నిజంగానే కలిశాయా...?

05-03-201905-03-2019 07:45:07 IST
Updated On 06-03-2019 12:58:27 ISTUpdated On 06-03-20192019-03-05T02:15:07.811Z05-03-2019 2019-03-05T02:14:24.798Z - 2019-03-06T07:28:27.552Z - 06-03-2019

ఆ రెండు వర్గాలు నిజంగానే కలిశాయా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నూలు టీడీపీలో వింత పరిస్థితి నెలకొంది. ఇప్పటి దాకా ఎవ్వరూ ఊహించని విధంగా ఏళ్ల తరబడి శత్రువులుగా కొనసాగిన కోట్ల, కే.ఈ. కుటుంబాలు ఒకే వేదిక మీద, ఒకే పార్టీ జెండా పట్టుకుని సరికొత్త రాజకీయానికి తెర తీశాయి. వర్గ పోరాటాలతో జిల్లా వాసులను హడలెత్తించిన ఈ రెండు కుటుంబాలు... ఏపీ సీఎం చంద్రబాబు సాక్షిగా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. జిల్లా వాసులకు ఇది ఊహించని పరిణామమే. 

రెండు బలమైన శత్రు శిబిరాలు ఒక తాటి మీదకు రావడం అంటే, పాత వైషమ్యాలు మర్చిపోయినట్లు కాదు. అప్పటికీ, ఆ తర్వాత కొన్నాళ్ల వరకూ కొత్త గొడవలు పుట్టుకు రావని చెప్పడం మాత్రమే. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో కోట్ల, కే.ఈ వర్గాలు ఇదే తరహా రాజకీయం నడుపుతున్నాయి. మొదట్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరికను ఒప్పుకోని కే.ఈ. కృష్ణమూర్తికి... ఆ తర్వాత వాస్తవం బోధ పడింది. జగన్ పార్టీ తన సొంత నియోజకవర్గంలో కూడా బలంగా మారింది. తన కుమారుడు పోటీ చేసినా ఓడిపోయే పరిస్థితి వచ్చిందన్న అనుమానం కే.ఈ.కి వచ్చింది.

ఇదే సమయంలో కోట్ల వర్గం పరోక్షంగా జగన్ వైపు వెళ్తే... తన ఓటమి ఖాయం. అందుకే ఆయన ఇష్టం లేకపోయినా కోట్ల చేరికను ఒప్పుకున్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. తాను కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు జగన్ పార్టీలో ఖాళీ లేకపోవడం, అనుకున్న విధంగా చంద్రబాబు రియాక్ట్ అవ్వడంతో కోట్ల టీడీపీలో చేరకతప్పలేదు. తనకు ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు, టీడీపీ ఓట్లు కలిస్తే గెలవడం ఖాయమన్నది కోట్ల ఆలోచన.

అయితే నేతలు కాంప్రమైజ్ కావడంతో కార్యకర్తలు కూడా ప్రస్తుతానికి చేతులు కలిపారు. కానీ ఎన్నికల వేళ ఈ అవసరార్థపు స్నేహం కలిసొస్తుందా అంటే... ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కచ్చితంగా ఎక్కడో అక్కడ అనుమాన బీజం పెరిగి పెద్దది అవుతుంది. ఎందుకంటే నేతలు సర్దుకున్నా... ఫ్యాక్షన్ బారిన పడ్డ కుటుంబాలు సర్దుకు పోతారన్న గ్యారెంటీ లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle