ఆ రెండు చోట్ల బాబు ప్రచారానికి వెళ్లలేదెందుకో?
09-04-201909-04-2019 13:01:00 IST
Updated On 09-04-2019 16:55:26 ISTUpdated On 09-04-20192019-04-09T07:31:00.516Z09-04-2019 2019-04-09T07:30:58.198Z - 2019-04-09T11:25:26.011Z - 09-04-2019

ఎన్నికల్లో నిజమైన ప్రత్యర్థులు ఎవరు.. కాగితం పులులు ఎవరన్నది ఆయా నాయకులు ప్రచారం చేసిన తీరును బట్టి అంచనా వేయవచ్చు. పైకి పోటీ ఇస్తున్నాం అని చెప్తూ లోపల చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న టీడీపీ-జనసేన గుట్టును వాళ్ల ప్రచార సరళే రట్టు చేసింది. వాళ్లిద్దరూ వేర్వేరు కాదు ఒక్కటేనని వాళ్ల ప్రచారాలను బట్టి ప్రజలే ఓ నిర్ణయానికి ఒచ్చేసినట్టున్నారు. అదెలాగంటే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రచారం చేశారు. చంద్రబాబును కుప్పం ప్రజలు ఎందుకు ఓడించాలో తన ప్రచారంలో ప్రజలకు వివరించి చెప్పారు. కుప్పానికి చంద్రబాబు 30 ఏళ్లలో చేసినదానికంటే వైఎస్ ఐదేళ్ల పాలనలో చేసిందే ఎక్కువని జగన్ తనదైన ధోరణిలో చెప్పారు. అలాగే చంద్రబాబు కూడా పులివెందులకు ఆ వైఎస్,ఈ జగన్ ఏమీ చెయ్యలేదని, పులివెందులకు నీళ్లు తానే ఇచ్చానని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థులు కాబట్టి సహజంగానే ఇలాంటి విమర్శలు, ప్రతివిమర్శలూ చేసుకోవడం సహజం. వైఎస్ జగన్‌కు చంద్రబాబు ఎంతో, జనసేన అధ్యక్షుడు పవన్ కూడా అంతేకాబట్టి పవన్ పోటీలో ఉన్న గాజువాకకు వెళ్లి గర్జించారు జగన్. మీకు ఒక యాక్టర్ కావాలో, లోకల్ హీరో కావాలో తేల్చుకోండి అని ఫలితాన్ని గాజువాక ఓటర్లు వదిలి వచ్చారు. అలాగే వైఎస్ షర్మిల భీమవరం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అది పవన్ పోటీ చేస్తున్న మరో స్థానం. ఈ యాక్టర్‌ని డైరెక్ట్ చేసేది చంద్రబాబేనని షర్మిల బాహాటంగానే విమర్శించారు. ఏదో ఒక రోజు అన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసినట్టు ఈ పవన్ కల్యాణ్ తన పార్టీని తెలుగుదేశంలో కలిపేయడం ఖాయమని కూడా షర్మిల ఓ మెట్టు పైకెక్కి విమర్శించారు. మరి ఈ స్థాయి విమర్శలు పవన్‌పై చంద్రబాబు అండ్ కో నుంచి ఏవీ..? ఎందుకో బాబుగారు గాజువాకలోగానీ, భీమవరంలోగానీ ప్రచారం కూడా చెయ్యలేదు. అంటే.. ఆ రెండు చోట్ల టీడీపీ ఓడిపోవాలని చంద్రబాబు స్వయంగా కోరుకుంటున్నట్టే కదా. అలాగే... పవన్ కూడా కుప్పంలో ప్రచారం చెయ్యలేదు. మరి పులివెందులలోనూ చెయ్యలేదు కదా అనొచ్చు. పోనీ కుప్పాన్నీ, పులివెందులనీ మినహాయించారులే అని అనుకోవచ్చు. మరి చినబాబు లోకేష్ పోటీలో ఉన్నన మంగళగిరిలో ఆ జనసేనాని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రచారం చెయ్యలేదు..? ఐదేళ్లు పాలించిన ముఖ్యమంత్రిని వదిలి ప్రతిపక్షనాయుడినే పవన్ ఎందుకు టార్గెట్‌గా విమర్శిస్తున్నారు. అంటే.. పైకి కనిపించని, పైకిచెప్పుకోలేని చీకటి ఒప్పందం ఏదో జరిగిందనే కదా దీని అర్థం. వీళ్ల మాటలు చెప్పకపోయినా వీళ్ల చర్యలు, ప్రచార సరళులు అవేకదా చెప్తున్నాయ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమో షర్మిల మాటే నిజమైనా కావొచ్చేమో.. అంతా మే 23వ తేదీ వచ్చే ఫలితాలను బట్టీ డిసైడౌతుంది. అప్పటివరకూ వెయిట్ అండ్ సీ.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా