newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఆ మూడు జిల్లాలకు బంపర్ ఆఫర్

05-12-201905-12-2019 09:07:02 IST
2019-12-05T03:37:02.384Z05-12-2019 2019-12-05T03:36:47.191Z - - 19-01-2020

ఆ మూడు జిల్లాలకు బంపర్ ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తే ఎప్పుడు వస్తాయో తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఇదే. దీనికి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చరమగీతం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్యాస్ పైపులైన్ల ద్వారా గ్యాస్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అందులో భాగంగా ఏపీలోని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తొమ్మిది లక్షల 29 వేల ఇళ్ళకు పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ సరఫరా జరగనుంది. కేంద్ర ప్రభుత్వంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజ్యసభలో తెలిపారు. 

వైఎస్సార్‌సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. పైపు లైన్‌ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్‌ సరఫరా చేసే ఈ ప్రాజెక్ట్‌ కోసం ఐఓసీఎల్‌ 211 కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనుంది. నిర్దేశించిన ప్రాంతాల్లో  సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ అథారిటీకి ఉందని మంత్రి తెలిపారు. 

గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ హక్కుల కోసం జరిగిన 9వ రౌండ్‌ వేలంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్‌ గ్యాస్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసి దానిని ఆపరేట్‌ చేసే హక్కు ఐఓసీఎల్‌ దక్కించుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఐఓసీఎల్‌ హుక్‌-అప్‌ ఫెసిలిటీస్‌, సిటీ గ్యాస్‌ స్టేషన్‌, పైప్డ్‌ గ్యాస్‌ నెట్‌వర్క్‌ డిజైన్‌ పనులను పూర్తి చేసింది. ఈ మూడు జిల్లాల్లో గ్యాస్ సరఫరా పైపులైన్ల ద్వారా ప్రారంభం అయ్యాక మిగిలిన జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. దీంతో గ్యాస్ కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle