newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆ ముద్ర తొల‌గించుకుంటున్న జ‌గ‌న్

08-06-201908-06-2019 08:59:17 IST
Updated On 21-06-2019 14:42:11 ISTUpdated On 21-06-20192019-06-08T03:29:17.606Z08-06-2019 2019-06-08T03:29:14.696Z - 2019-06-21T09:12:11.350Z - 21-06-2019

ఆ ముద్ర తొల‌గించుకుంటున్న జ‌గ‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కులాల‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో కాంగ్రెస్ లో రెడ్ల‌కు, తెలుగుదేశం పార్టీలో క‌మ్మ‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌నే భావ‌న ఉండేది. ముఖ్యంగా రెడ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా ఆధిప‌త్యం చూపుతున్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెడ్డి నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఉండేది. గ‌తంలో కాంగ్రెస్ తో ఉన్న రెడ్లు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. జ‌గ‌న్ రెడ్డి నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తార‌నే భావ‌న ఇంత‌వ‌ర‌కు ఉండేది.

అయితే, జ‌గ‌న్ త‌న పార్టీపై ఉన్న ఆ ముద్ర‌ను తొల‌గించుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు మంత్రివ‌ర్గాన్ని చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున ఏకంగా 51 మందికి పైగా రెడ్లు విజ‌యం సాధించారు. ముఖ్యంగా రాయ‌లసీమ నాలుగు జిల్లాల‌తో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి రెడ్డి సామాజవ‌ర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ‌మంది గెలిచారు.

గెలిచిన 51 మంది రెడ్ల‌లో క‌నీసం 30 మంది మంత్రి ప‌ద‌వుల‌ను ఆశించారు. వీరిలో చాలామంది సీనియ‌ర్లు సైతం ఉన్నారు. కానీ, జ‌గ‌న్ ఈసారి రెడ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. త‌న పార్టీపై ఉన్న రెడ్డి ముద్ర‌ను తొల‌గించుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. కేవ‌లం రెడ్ల‌కు 4 మంత్రి ప‌ద‌వులు మాత్ర‌మే ఇచ్చారు. ఇందులోనూ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితులు కాబ‌ట్టి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి జ‌గ‌న్ కోసం కిర‌ణ్ క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌విని త్యాగం చేశారు. దీంతో ఆయ‌న‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన‌ట్లుగానే జ‌గ‌న్ క్యాబినెట్ బెర్త్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. నెల్లూరు జిల్లాలో మేక‌పాటి కుటుంబం ఆది నుంచీ జ‌గ‌న్ వెంట న‌డుస్తోంది. జ‌గ‌న్ కోసం ఉప ఎన్నిక‌లు ఎదుర్కున్నారు. ఈసారి రాజ‌మోహ‌న్ రెడ్డి ఎంపీ టిక్కెట్ కూడా వ‌దులుకోవ‌డంతో ఆయ‌న కుమారుడు, జ‌గ‌న్ స‌న్నిహితులు గౌత‌మ్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

క‌ర్నూలు జిల్లాలో విద్యావంతులైన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి సామ‌ర్థ్యంపై జ‌గ‌న్ కు న‌మ్మ‌కం ఎక్కువ‌. అందుకే కొత్త ఎమ్మెల్యే అయినా గ‌త‌సారి ఆయ‌న‌కు పీఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయ‌న‌కు ముందుగా అనుకున్న‌ట్లే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

వీరు మిన‌హా మంత్రి ప‌ద‌వుల కోసం ఇంకా చాలామంది రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నించారు. వీరిలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, కాట‌సాని రాంరెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, రోజా వంటి విధేయులు ఉన్నారు. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి జ‌గ‌న్ నుంచి హామీ కూడా పొందారు. అయినా వీరిని జ‌గ‌న్ ఈసారి క్యాబినెట్ లోకి తీసుకోలేదు.

ఇందుకు ముఖ్య‌కార‌ణం బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపుల‌కు పెద్ద‌పీట వేయ‌డ‌మే. కేవ‌లం నలుగురు రెడ్ల‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ త‌న పార్టీపై ఉన్న రెడ్డి ముద్ర‌ను తొల‌గించుకున్నారు.

గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం కూడా రెడ్ల‌కు నాలుగు మంత్రి ప‌ద‌వులు ఇచ్చింది. అంటే టీడీపీ కంటే రెడ్లకు వైసీపీ పెద్ద‌పీట ఏమీ వేయ‌లేదు. అయితే, ఆదినుంచీ జ‌గ‌న్ వెన్నంటే న‌డిచినా త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డంపై కొంద‌రు రెడ్డి ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రుల్లో అసంతృప్తి నెల‌కొంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle