newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ఆ ప‌దవి కోసమే పోటీ ప‌డుతున్నారా..?

28-07-201928-07-2019 10:25:32 IST
2019-07-28T04:55:32.708Z28-07-2019 2019-07-28T04:55:28.555Z - - 26-08-2019

ఆ ప‌దవి కోసమే పోటీ ప‌డుతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని కంక‌ణం క‌ట్టుకుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో నోటా కంటే త‌క్కువ ఎట్లు సాధించిన ఆ పార్టీ అనూహ్యంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన జోష్‌తో ఏపీలోనూ పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఆ పార్టీ కీల‌క నేత‌లు సైతం జోరు పెంచారు. ఒక‌రిని మించి ఒక‌రు అన్న‌ట్లుగా యాక్టీవ్‌గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. వైసీపీని, టీడీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని ఉప‌యోగించుకొని పార్టీని ఏపీలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కీల‌క నేత‌లు రోజూ ఏదో ఓ నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, వీరంతా ఒక్క‌సారిగా ఇంత యాక్టీవ్‌గా మారడం వెనుక మాత్రం ఓ టార్గెట్ ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరంతా కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అందుకే దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఏపీలో ఓడిపోతామ‌ని తెలిసి కూడా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎంపీలుగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఈ స‌మ‌యంలో వీరికి బీజేపీ పెద్ద‌ల నుంచి భ‌విష్య‌త్‌పై హామీ ల‌భించింది. ఈ హామీ నేప‌థ్యంలో త‌మ‌కు కేంద్ర క్యాబినెట్‌లో చోటు ద‌క్కుతుంద‌ని వీరిద్ద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. మొద‌టి విడ‌త‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎవ‌రినీ క్యాబినెట్‌లోకి తీసుకోక‌పోవ‌డంతో త్వ‌ర‌లోనే తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటీవ‌ల ఈ విష‌యాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ కూడా చెప్పారు.

ఈ ప‌ద‌వి కోసం రేసులో క‌న్నా లక్ష్మీనారాయ‌ణ ముందున్నారు. ఆయ‌న గ‌తంలో వైసీపీలోకి చేరేందుకు ముహూర్తంగా ఖ‌రార‌య్యాక బీజేపీ పెద్ద‌లు బుజ్జ‌గించి హామీలు ఇవ్వ‌డంతో వెన‌క్కుత‌గ్గి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇప్పుడు ఆయ‌న జ‌గ‌న్‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌న‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటార‌ని ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇక‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి యూపీఏ హ‌యాంలో కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో చేరాక ఆమెకు పార్టీ మ‌హిళా మోర్చాలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆమె భ‌ర్త‌, కుమారుడు వైసీపీలోకి పోయినా ఆమె మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు. ఇటీవ‌ల ఆమె వైసీపీపై మాట‌ల‌దాడిని పెంచారు. దీంతో ఆమె కూడా మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారనే ప్ర‌చారం ఉంది.

ఇక‌, ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా రేసులో ఉన్నార‌ట‌. బీజేపీ, టీడీపీ విడిపోయాక రాష్ట్రంలో బీజేపీని టీడీపీ విల‌న్‌ను చేసే స‌మ‌యంలో జీవీఎల్ టీడీపీని ఎదుర్కునేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. టీడీపీపై పెద్ద ఎత్తున ఆయ‌న విమ‌ర్శ‌లు చేసేవారు. ఇప్పుడు కొంత సైలెంట్ అయినా ఆయ‌న కూడా ఏపీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందేమో అని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌద‌రి బీజేపీని బ‌లోపేతం చేసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో ఆ పార్టీ నేత‌ల‌ను బీజేపీలోకి చేర్చి పార్టీ పెద్ద‌ల వ‌ద్ద బ‌లం చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌న కూడా కేంద్ర‌మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే, ఇటీవ‌లి పార్టీలో చేర‌డం, ప‌లు ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు త‌క్కువే అంటున్నారు. ఒకవేళ ఏపీ నుంచి కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఎవ‌రినైనా తీసుకుంటే క‌న్నా, పురందేశ్వ‌రి, జీవీఎల్‌ల‌లో ఒక‌రిని తీసుకునే అవ‌కాశం ఉంది.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle