newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఆ పార్టీ ఆచూకీ తెలియ‌డం లేదు..!

24-10-201924-10-2019 08:06:51 IST
Updated On 24-10-2019 14:55:25 ISTUpdated On 24-10-20192019-10-24T02:36:51.371Z24-10-2019 2019-10-24T02:36:38.140Z - 2019-10-24T09:25:25.971Z - 24-10-2019

ఆ పార్టీ ఆచూకీ తెలియ‌డం లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
130 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్ర‌మంగా ప్రాభ‌వాన్ని. కోల్పోతోంది. ఒక‌ప్పుడు ఆ పార్టీకి కంచుకోట‌ల్లా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు క‌నుమ‌రుగ‌వుతోంది. హేమాహేమీల్లాంటి నాయ‌కుల‌ను అందించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌గా మిగిలిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. అస‌లు పార్టీలో ఎవ‌రు ఉన్నారు ? ఏపీలో పార్టీ ఉందా ? అనే స్థాయికి కాంగ్రెస్ దిగ‌జారిపోయింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుగులేని శ‌క్తిగా ఉన్న కాంగ్రెస్ కి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణంతో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ స్వంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ నేత‌ల‌ను త‌న‌తో తీసుకెళ్లారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న‌తో ఉన్న ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు కాంగ్రెస్ నేత‌లు, ఓట్లు మ‌ళ్లాయి.

2014 ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థులు, అంత‌వ‌ర‌కు మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లు పోటీ చేశారు. దీంతో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు ద‌క్కాయి. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉంటే భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని గ్ర‌హించిన‌ చాలామంది నేత‌లు వైసీపీ, టీడీపీ, బీజేపీలో చేరిపోయారు. అయినా కాంగ్రెస్‌పై ప్రేమ‌ను చంపుకోలేక, పార్టీని వ‌ద‌ల‌లేక ఇంకా కొంద‌రు కొన‌సాగుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు కూడా కాంగ్రెస్‌కు దొర‌క‌లేదు. ఎలాగో పోటీ చేసినా దారుణ ఫలితాలు వ‌చ్చాయి. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క చోట కూడా డిపాజిట్ ద‌క్క‌లేదు.

దీంతో ఆ పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న చేసిన కోపం ప్ర‌జ‌ల్లో ప‌దేళ్ల‌కో, ప‌దిహేనేళ్ల‌కో పోతుంద‌ని, త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుంద‌ని మొద‌ట కాంగ్రెస్ నేత‌లు భావించారు. కానీ, అస‌లు అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ బ‌తికే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు.

ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ర‌ఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇంత‌వ‌ర‌కు పార్టీ త‌ర‌పున ప్ర‌భుత్వ విధానాల‌పై సానుకూలంగానో, ప్ర‌తికూలంగానో ఆ పార్టీ మాట్లాడిన దాఖ‌లాలు లేవు.

అస‌లు ఆ పార్టీలో ఇంకా ఏయే నాయ‌కులు మిగిలి ఉన్నారో ఆ పార్టీ శ్రేణుల‌కే అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతోఇంతో అవ‌కాశం ఉన్న తెలంగాణలోనే పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు కాంగ్రెస్ అధిష్ఠానం.

ఇక‌, ఏ అవ‌కాశ‌మూ లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ ప‌రిస్థితిని ప‌ట్టించుకునే ఓపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా క‌నిపించ‌డం లేదు. ఈ స‌మ‌యంలో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కొత్త వారు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒక‌వేళ కొత్త వారికి అవ‌కాశం ఇస్తే, వారు క‌నీసం ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం చేస్తే క‌మ్యూనిస్టు పార్టీల్లా అక్క‌డ‌క్క‌డ పార్టీ జెండా అయినా క‌నిపించే అవ‌కాశం ఉంది. లేక‌పోతే త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ జెండా క‌నుమ‌రుగు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle