newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆ నొప్పి గుడ్డుపెట్టే కోడికి మాత్ర‌మే తెలుస్తుంది : బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి

22-12-201922-12-2019 11:28:10 IST
Updated On 23-12-2019 12:02:37 ISTUpdated On 23-12-20192019-12-22T05:58:10.657Z22-12-2019 2019-12-22T05:57:55.938Z - 2019-12-23T06:32:37.693Z - 23-12-2019

ఆ నొప్పి గుడ్డుపెట్టే కోడికి మాత్ర‌మే తెలుస్తుంది : బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాకు తెలియ‌కుండానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా.. ఇక‌ త‌ప్ప‌క, త‌ప్పించుకోలేక రాజ‌కీయం చేస్తున్నానంటూ నందికొట్కూరు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి అన్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ క‌ళాశాల ఏర్పాటు చేసిన కైట్స్ ఫెస్ట్‌కు ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.

విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ఇంకా తాను రాజ‌కీయాలు చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికీ త‌న జీవితం త‌న చేతుల్లో లేద‌న్నారు. కొన్ని వంద‌ల జీవితాలు త‌న‌పై ఆధార‌ప‌డి ఉన్నాయ‌న్నారు. త‌న‌కంటే త‌న‌మీద ఆధార‌ప‌డిన వారి జీవితాలే త‌న‌కు ముఖ్య‌మ‌న్నారు.

సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న‌ త‌న ఫోటోల‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు.. అబ్బా.., సిద్ధార్థ‌రెడ్డి ఏం ఎంజాయ్ చేస్తున్నాడురా..! లైఫ్ అంటే వీడిదేరా..! అని అనుకుంటున్నారు. కానీ, గుడ్డు పెట్టే కోడికి మాత్ర‌మే ఆ నొప్పి ఏంట‌న్న‌ది తెలుస్తుందంటూ త‌నదైన మాస్ పంచ్ డైలాగ్‌ల‌తో త‌న లైఫ్ గురించి చెప్పుకొచ్చారు సిద్ధార్థ‌రెడ్డి.

ఒక తండ్రికి వెయ్యి కోట్లు ఆస్తి ఉండి.., అత‌ని కొడుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.., ఒక ల‌క్ష రూపాయ‌ల‌కు బ్యాన‌ర్లు, ఒక ల‌క్ష రూపాయ‌ల‌తో అడ్వ‌ర్టైజ్‌మెంట్‌లు, ఒక ల‌క్ష రూపాయ‌లతో పెయిడ్ ఆర్డిక‌ల్స్ రాయించుకునే వారికి మాత్ర‌మే నేటి రాజ‌కీయాలు బాగుంటాయ‌ని, అలా రాయించుకునేవారు ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో చాలా మందే ఉన్నార‌న్నారు.

ఒక ఉత్త‌మ‌మైన ఆశ‌తో, ఉన్న‌త‌మైన ఆశ‌యంతో, కుటుంబ గౌర‌వం కోసం మ‌న‌వెంట ఉండే వారిని కాపాడుకోవాల‌న్న ఏ ఒక్క‌డికి కూడా ఈ రోజు రాజ‌కీయాలు బాగాలేవ‌ని సిద్ధార్థ‌రెడ్డి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇలా డ‌బ్బు శాసిస్తున్న రాజ‌కీయాల్లో మార్పు రావాలంటే అది కేవ‌లం యువ‌కుల‌కే సాధ్య‌మ‌న్నారు.

నాలుగు సంవ‌త్స‌రాల క్రితం క‌ర్నూలు రాజ‌కీయాల్లో తిరుగుతున్న స‌మ‌యంలో నాకు ఏ ఒక్క లీడ‌రు కూడా స‌పోర్టు చేయ‌లేదు. నా బంధువులు కూడా నా వెంట రాలేదు. ప్ర‌తి ఒక్క‌డూ అవ‌హేళ‌న‌గా మాట్లాడాడు. కానీ, ఇదే క‌ర్నూలులో ఉండే అనేక మంది యువ‌కులు నా వెంట తిరిగారు. ఇలా ఒక సామ్రాజ్యం ఏర్ప‌డాల‌న్నా.. ఏర్ప‌డిన సామ్రాజ్యం కూలిపోవాల‌న్నా అది యువ‌కుల‌కే సాధ్య‌మ‌న్నారు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle