newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆ ‘నెల్లూరు పెద్దారెడ్లు’ అంతా ఏమ‌య్యారు..?

01-07-201901-07-2019 08:41:56 IST
Updated On 03-07-2019 12:40:02 ISTUpdated On 03-07-20192019-07-01T03:11:56.799Z01-07-2019 2019-07-01T02:58:29.077Z - 2019-07-03T07:10:02.117Z - 03-07-2019

ఆ ‘నెల్లూరు పెద్దారెడ్లు’ అంతా ఏమ‌య్యారు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాల్లో ఎంతో దిట్ట‌. ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో కొన్ని కొత్త విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో ఒక‌టి ఏ సామాజిక‌వ‌ర్గ నాయ‌కుడిని ఆ సామాజిక‌వ‌ర్గం వారితో విమ‌ర్శలు చేయించ‌డం. ఈ విధానాన్ని తెలుగుదేశం పార్టీ బాగా అవ‌లంభిస్తుంది.

గ‌త ఐదేళ్ల తెలుగుదేశం ప్ర‌భుత్వంలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని కూడా ఇలానే రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం వారితో తెగ విమ‌ర్శ‌లు చేయించారు.ఇందుకోసం ప్ర‌త్యేకంగా కొంద‌రికి చంద్ర‌బాబు బాధ్య‌త‌లు ఇవ్వ‌గా మ‌రికొంద‌రేమో చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి జ‌గ‌న్‌ను ఆయ‌న సొంత రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం నేత‌లు ఎడాపెడా తిట్టేవారు.

అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారీ ఓట‌మిని చ‌విచూసి, వారు ఇంత‌కాలం విమ‌ర్శించిన జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. త‌ర‌చూ మీడియా ముందుకు వ‌చ్చే వీరు ఇప్పుడు క‌నిపించ‌డ‌మే మానేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయ‌డానికి చంద్ర‌బాబుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసిన‌ప్పుడు మొద‌టి విడ‌త‌లో క‌డ‌ప జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణ‌రెడ్డి, క‌ర్నూలు జిల్లా నుంచి భూమా కుటుంబం టీడీపీలో చేరిపోయింది.

అయితే, వైఎస్ కుటుంబంతో వ్య‌క్తిగ‌తంగా స‌త్సంబంధాలు ఉన్న భూమా కుటుంబం త‌మ ప‌ని తాము చూసుకున్నా ఆదినారాయ‌ణ‌రెడ్డి మాత్రం కొంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ సొంత జిల్లా వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు.

దీంతో ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌రింత రెచ్చిపోయారు. జ‌గ‌న్‌పై అనేకసార్లు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లూ చేశారు. విష‌య‌మేదైనా జ‌గ‌న్‌ను తిట్ట‌డంలో ఆయ‌న ముందుండేవారు. ఇక‌, క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం జెండా ఎగ‌రేస్తామ‌ని, పులివెందుల‌లో జ‌గ‌న్ మెజారిటీని త‌గ్గిస్తామ‌ని గ‌ట్టిగా చెప్పారు.

కానీ, ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయ్యింది. క‌డ‌ప ఎంపీగా ఆదినారాయ‌ణ‌రెడ్డి దారుణంగా ఓడిపోవ‌డంతో పాటు స్వంత నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగులోనూ పార్టీని గెలిపించ‌లేక‌పోయారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న సైలెంట్ అయిపోయారు. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో ఓడిన అమ‌ర్‌నాథ్‌రెడ్డిదీ ఇదే ప‌రిస్థితి.

ఇక‌, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అయితే జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం అద‌న‌పు విధిగా పెట్టుకున్నారు. క‌నీసం వారానికి రెండుమూడు సార్లైనా జ‌గ‌న్‌ను తిట్టేవారు. ఆయ‌న‌కు సైతం మంత్రి ప‌ద‌వి ఇచ్చాక మ‌రింత దూకుడు పెంచారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో స‌ర్వేప‌ల్లి నుంచి క‌చ్చితంగా గెల‌వాల‌ని భావించిన ఆయ‌న‌కు చుక్కెదురైంది. ఐదోసారి దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.

ఇక‌, అనంత‌పురం నుంచి జేసీ కుటుంబానిదీ ఇదే ప‌రిస్థితి. జ‌గ‌న్‌ను, జ‌గ‌న్ కుటుంబాన్ని ఉద్దేశించి జేసీ సోద‌రులు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. ప‌దేప‌దే జ‌గ‌న్ క‌ల్తీ రెడ్డి అని తిట్టారు. తీరా ఎన్నిక‌ల్లో జేసీ కుటుంబం ఎన్నడూ లేని విధంగా ఓట‌మిపాలైంది. అయితే, జేసీ దివాక‌ర్ రెడ్డి మాత్రం విష‌యం గ్ర‌హించి జ‌గ‌న్‌ను తిట్ట‌డం వ‌ల్ల రెడ్లు త‌మ కుటుంబానికి కొంత దూర‌మ‌య్యార‌ని ఒప్పుకున్నారు.

మ‌రి, అధికారంలో ఉన్న జ‌గ‌న్‌తో మ‌ళ్లీ పెట్టుకోవ‌డం ఎందుకులే అని సైలెంట్ అయ్యారో లేదా కొంత విరామం ఇద్దామ‌నుకున్నారో లేక జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం ఎన్నిక‌ల్లో న‌ష్టం చేసింద‌నుకున్నారో వ్యూహం మార్చారు. 

ఈ నేత‌లంతా ఇప్పుడు జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో రెడ్డి నేత‌లు కాకుండా టీడీపీ నుంచి ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గన్‌ను విమ‌ర్శించాల్సి వ‌స్తోంది. వీరి మౌనం వెనుక పార్టీ మారాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లో బద్ధ శత్రువులు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle