newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి వారే ఎమ్మెల్యేలు..!

13-11-201913-11-2019 08:51:26 IST
2019-11-13T03:21:26.091Z13-11-2019 2019-11-13T03:21:17.639Z - - 11-08-2020

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి వారే ఎమ్మెల్యేలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గ‌మంటే తాజా ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌లా ఉండేది. అటువంటి చోట టీడీపీదే మొన్న‌టి ఎన్నిక‌ల్లో సైతం చివ‌రి వ‌ర‌కు విజ‌య‌మ‌ని అంద‌రూ భావిస్తూ వ‌చ్చారు.

కానీ, ఫ‌లితం మాత్రం అంద‌రి ఆలోచ‌న‌ల‌ను తారుమారు చేసింది. వైసీపీ అభ్య‌ర్ధి క‌డుబండి శ్రీ‌నివాస‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌ల‌స వ‌చ్చిన ఆయ‌న ఒక్క‌సారిగా ఎమ్మెల్యే కావ‌డం అంద‌ర్నీ నోరెళ్ల‌బెట్టేలా చేసింది.

స‌రే మొత్తం మీద టీడీపీ ఓడింది. ఎస్‌.కోట‌లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది. కానీ, ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ‌నివాస‌రావు స్థానికేతురుడు కావ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందు నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క నేత‌లంతా వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు.

అధినేత ఆదేశాల‌తో ఒక్క‌తాటిపైకి వ‌చ్చిన నాయ‌కులు టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలుకొట్టి క‌డుబండి శ్రీ‌నివాస‌రావును గెలిపించారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అప్ప‌ట్లో అధిష్టానం మాట కాద‌న‌లేక ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసినా ఇప్పుడు మాత్రం ఎవ‌రికి వారు ఆధిప‌త్యం కోసం తెగ ఆరాట‌ప‌డుతున్నార‌ట‌.

దీంతో క‌డుబండి శ్రీ‌నివాస‌రావు పేరుకే ఎమ్మెల్యేగా మిగిలిపోయార‌న్న టాక్ ఎస్‌.కోట‌లో వినిపిస్తోంది. నియోజ‌క‌వర్గంలో మిగిలిన స్థానిక సీనియ‌ర్ నేత‌లు కూడా ఎవ‌రికి వారే ఎమ్మెల్యేలుగా బిల్డ‌ప్ ఇచ్చేస్తున్నారు. ఈ య‌వ్వారం ఎమ్మెల్యే క‌డుబండికి మింగుడు ప‌డ‌టం లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల విమర్శ‌.

నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలోను రెండు గ్రూపులుగా నేత‌లు విడిపోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి మ‌రింత గజిబిజిగా మారిపోయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లానికో సీనియ‌ర్ నాయ‌కుడు ఉండ‌టం, మొన్న ఎన్నిక‌ల్లో వీరంతా టికెట్లు ఆశించి భంగ‌ప‌డ‌ట‌మే తాజా ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని కార్య‌క‌ర్త‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

ఎస్‌.కోట‌లో ఇందుకూరి ర‌ఘురాజు, మ‌రో సీనియ‌ర్ నేత అల్లు జోగినాయుడు, చిన‌రామునాయుడు, కొత్త‌వ‌ల‌స మండ‌లానికి చెందిన నెక్క‌ల నాయుడు, ఇలా ఎవ‌రికివారు వారి వారి ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ ఎమ్మెల్యేపై పైచేయి సాధించేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతున్నట్టు స‌మాచారం.

జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త చిన్న శ్రీ‌ను అండ‌దండ‌ల‌తో ఎవ‌రి ప‌నులు వారు చేసుకుపోతుండ‌టంతో ఎమ్మెల్యే అవ‌స‌రం ఎవ్వ‌రికీ రావ‌డం లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేత‌లంతా మొద‌ట్నుంచి బొత్స అనుచ‌రులుగా కొన‌సాగుతున్నారు.

నేరుగా బొత్స‌ను సంప్ర‌దించి నియోజ‌క‌వ‌ర్గ ప‌నులు చేసుకోగ‌ల స‌త్తా  ఉన్న నేత‌లు. దీంతో త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎమ్మెల్యే క‌డుబండి ఫీల‌వుతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. ఇక లాభం లేద‌నుకున్న ఎమ్మెల్యే జ‌గ‌న్‌ను క‌లిసి త‌న బాధ చెప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తుంది.

అయితే, ఎమ్మెల్యే కూడా ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స‌రిగ్గా అందుబాటులో ఉండ‌టం లేదంటున్నారు. అపడ‌పాద‌డ‌పా చుట్టం చూపుగా వ‌చ్చి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఇక అధినేత ఓ కన్నేసి సెట్‌చేయ‌క‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని కార్య‌క‌ర్తలు మీడియాకు చెప్పుకొస్తున్నారు.

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle