newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఆ నలుగురు వైస్సార్సీపీ నేతల మౌనం ఎందుకు.. ఏదో జరుగుతుంది

28-07-202028-07-2020 11:26:15 IST
Updated On 28-07-2020 11:27:18 ISTUpdated On 28-07-20202020-07-28T05:56:15.677Z28-07-2020 2020-07-28T05:56:11.480Z - 2020-07-28T05:57:18.118Z - 28-07-2020

ఆ నలుగురు వైస్సార్సీపీ నేతల మౌనం ఎందుకు.. ఏదో జరుగుతుంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీలోపలి నుంచే చేస్తున్న మెత్తటిదాడి, సుతిమెత్తని హెచ్చరికలు, నన్నేమీ చేయలేరంటూ వివిధ టీవీ చానల్స్‌లో చేస్తున్న సవాళ్లు వైసీపీ అగ్రనాయకత్వానికి తల బొప్పి కట్టిస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా వైఎస్ జగన్ పాలనా పద్ధతి, వ్యవహారం ఏమాత్రం జీర్ణం కానీ నలుగురు వైకాపా సీనియర్ నేతలు తమ అధినేతపై తీరని అసంతృప్తితో వేగిపోతున్నట్లు సమాచారం. ఈ నలుగురు నేతలు బహిరంగంగానూ, అంతర్గతంగానూ తమ అధినేత తీరుతెన్నులపై తమ అసమ్మతిని ఇప్పటికే వ్యక్తం చేశారు కూడా..

ఒక్కమాటలో చెప్పాలంటే నర్సాపురం ఎంపీ రామకృష్ణంరాజు వైకాపాకు కంట్లో నలుసులా తయారవగా ఆ నలుగురు సీనియర్ నేతలు కనిపించకుండా పార్టీకి బొప్పి కట్టిస్తున్నారు. ఇంతకూ ఎవరా నలుగురూ.. ఏంటా కథ..

తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనతోపాటు ఇన్నేళ్లూ పార్టీని అంటిపెట్టుకున్నావారితోపాటు వివిధ పార్టీల్లోని సీనియర్లను ఏరి కోరి సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత పార్టీలోని కొందరు సీనియర్లు ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతూ వచ్చారు. ప్రస్తుతం వీరి మౌనం, వ్యవహార శైలి అధికార పార్టీలో కాక రేపుతోంది. ఇన్నాళ్లూ జగన్ వెనకాల ఉండి నడిపించిన వీరంతా గత కొంతకాలంగా ప్రభుత్వ నిర్ణయాలు, అధినేత వ్యవహారంపై బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సీనియర్లు, తొలినుంచి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ల వ్యవహారంపై పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

వైసీపీని మొదటి నుంచి అంటిపెట్టుకుని వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న భూమన కరుణాకరరెడ్డి వ్యవహారం పార్టీ అధిష్టానానికి అంతుపట్టకుండా ఉంది. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌తో కూడా భూమనకు విడదీయలేని బంధం ఉంది. ఎన్నికల ముందువరకు పార్టీ కార్యకలాపాలను అన్నీ తానై నడిపించిన భూమన ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు నేతలను విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించగానే వైసీపీ జరిపిన విజయోత్సవ సభలో తాను ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. భూమన ప్రకటనపై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే భూమన మౌనం వెనుక పెద్ద కారణం ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. ఎన్నికల ముందువరకు ప్రతి అంశంలోనూ కీలకపాత్ర పోషించిన ఆయన్ను కాదని ఆయన శిష్యుడిని విప్ ‌తో పాటు కీలక పదవుల్లో నియమించడంపై కినుక వహించి భూమన మౌనం దాల్చారని అంటున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ నియోజకవర్గానికే పరిమితం అయ్యారని చెబుతున్నారు. 

అలాగే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆనం రామ నారాయణ రెడ్డి వ్యవహారంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో చేరిన కొత్తలో అధినేత జగన్‌ను ఎవరైనా ఏమైనా అంటే సహించేవారు కాదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆనం కొద్దిరోజులు సైలెంటుగానే ఉన్నారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడంతోపాటు జిల్లాలో తనకు మర్యాద ఇవ్వలేదని, కేవలం ఎమ్మెల్యేగా నామమాత్రంగా మారానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రౌడీయిజం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అప్పటినుంచి ఆయన పార్టీ, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేశారు. 

మరోవైపు వైసీపీకి ఉత్తరాంద్రలో పెద్దదిక్కుగా, అండగా ఉన్న మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వైఖరి అధిష్టానానికి అంతు పట్టడం లేదంటున్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ధర్మాన కీలకపాత్ర పోషించారు. వైసీపీలో చేరిన తర్వాత కూడా పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి కొత్త జిల్లాల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు పలుసందేహాలు కలిగించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ధర్మాన మంత్రిపదివిని ఆశించారు. కానీ మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రిపదవి దక్కడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిసైతం వరించింది. ప్రత్యక్ష రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన తనకు పార్టీ అధినేత తగిన స్థానం కల్పించలేదని ధర్మాన ప్రసాద రావు అంటున్నారట. అందుకే ఇన్నాళ్లు మౌనంగా ఉండి, ఇప్పుడు అధినేత తీరును నేరుగా తప్పుపడుతున్నారని అంటున్నారు సొంతపార్టీకి చెందినవారు. 

వైసీపీలోకి రాకముందు, వచ్చాక కూడా పార్టీ తీరును తప్పుపడుతూ వస్తున్న రఘురామ కృష్ణంరాజు ప్రస్తుతం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. 2014లో పార్టీలో చేరిన కొన్నాళ్లకే బయటకు వెళ్లి తిరిగి 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఈయన తన వ్యాఖ్యలు, విమర్శలతో అటు పార్టీనీ ఇటు ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పెడుతున్నారు. రఘురామ వ్యవహారం పార్టీ అధినేతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఒకవైపు తాను ఏ తప్పూ చేయడం లేదంటూనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ఎంపీ. పార్టీలో కీలక పాత్ర పోషించిన పై ముగ్గురిపై అంత సీరియస్‌గా వ్యవహరించని అధినేత, రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చాలా సీరియస్ అయ్యారు. తక్షణమే తనపై చర్యలు తీసుకోవాలని నేతలకు చెప్పారు వైఎస్ జగన్. 

మొత్తానికి ఏరికోరి పార్టీలోకి తీసుకున్న ఆ నలుగురి వ్యవహారం వైసీపీ అధినేతకు చికాకు తెప్పిస్తోందట. ఇప్పటికే ఆ నలుగురు నేతలలో ఒకరైన రఘురామ కృష్ణం రాజుపై చర్యలకు అధినేత సిద్ధం కాగా, మిగిలినవారి విషయంలో ఎలా ముందుకు వెళతారో మరి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle