newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఆ నలుగురు గెలిచి నిలుస్తారా?

21-04-201921-04-2019 09:36:37 IST
2019-04-21T04:06:37.556Z21-04-2019 2019-04-21T04:06:22.808Z - - 20-10-2019

ఆ నలుగురు గెలిచి నిలుస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లో సినీ గ్లామ‌ర్ అనేది ఓ అద‌న‌పు ఎట్రాక్షన్ కానీ, అదే అభ్యర్ధుల‌ను గెలిపించడానికి ప్రధానంగా ఉప‌యోగ‌ప‌డ‌దు. ఈ సూత్రం తెలీక చాలా మంది రాజకీయాల్లోకి వ‌చ్చి దెబ్బతినేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది సినిమా హీరోలు త‌మ‌ను తాము ఓ దేవుడిగా ఫీల‌వుతుంటారు. ఎక్కడికి వెళ్లిన జ‌నం ఎగ‌బ‌డి చూడ‌టం, ఫ్యాన్స్ హంగామా చేయ‌డం చూసి త‌మ‌ను తాము మైమరచిపోతారు.  ఈ ఫాలోయింగ్ మొత్తం త‌మ రాజ‌కీయ జీవితానికి క‌ల్సొస్తుంది అనుకుంటారు. సినిమాల్లో చెప్పే డైలాగుల‌తో ఓట్లు రాల‌తాయ‌ని భావిస్తారు. కానీ రీల్ లైఫ్ వేరు, రియ‌ల్ లైఫ్ వేరు అన్న సంగ‌తిని వారంతా చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. వెంట‌నే అర్థం చేసుకున్న వారు పాలిటిక్స్‌లో నెగ్గుకు వ‌స్తారు. 

స్వర్గీయ ఎన్టీఆర్, జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి, ప్రస్తుతం బరిలో వున్న హేమ‌మాలిని, రాజ్ బ‌బ్బర్ త‌దిత‌రులు ఈ కోవ‌కు చెందిన వారే. కానీ సినిమాని, రాజకీయాన్ని ఒక‌టిగా చూసే వారు అట్టర్ ఫ్లాప్ అవుతారు. దేశంలో ఇలాంటి మంది చాలా ఎక్కువ‌గా ఉన్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల్లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా ఏపీలో ప్ర‌ధాన పార్టీల నుంచి సినీ తార‌లు పోటీ చేశారు. హిందూపురం నుంచి బాల‌కృష్ణ న‌ర్సాపురం పార్ల‌మెంట్ సీటు నుంచి నాగ‌బాబు, భీమ‌వ‌రం, గాజువాక అసెంబ్లీ సీట్ల నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్, న‌గ‌రి నుంచి రోజా పోటీ చేశారు.

ఈ న‌లుగురిలో బాల‌కృష్ణ, రోజా ఇప్పటికే సిట్టింగ్ ఎంఎల్ఏలుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి రోజా టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మీద కేవ‌లం 858 ఓట్లతో గెలిచారు. అయితే గాలి ముద్దు కృష్ణమ‌నాయుడు చ‌నిపోవ‌డంతో ఈసారి రోజా మీద ఆయ‌న కుమారుడు గాలి భానుప్రకాష్ పోటీ చేశారు. ఈసారి కూడా అక్కడ పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే సీమ‌లో జ‌గ‌న్ హ‌వా బాగా ఉండటం, ఎన్నిక‌లకు ఏడాది ముందు నుంచి ఆమె జ‌నానికి అందుబాటులో ఉండ‌టం, బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గం అండ‌తో పాటు టీడీపీలో అంత‌ర్గత‌పోరు, ప్రభుత్వ వ్యతిరేక‌త‌లు రోజాను మ‌రోసారి గెలిపిస్తాయ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌. 

అయితే గాలి కుటుంబానికి ఉన్న బ‌ల‌మైన ప్రజాభిమానం, మ‌రోసారి భాను ప్రకాష్ విజ‌యానికి దోహ‌ద ప‌డుతుంద‌ని టీడీపీ నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇక హిందూపురంలో బాల‌కృష్ణకు ఈసారి ఆశించినంత పాజిటివ్ వేవ్ లేద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌. దీంతో పాటు ప్రచారంలో బాల‌య్య ప్రవ‌ర్తించిన తీరు టీడీపీ కార్యకర్తల్లో అస‌హ‌నం నింపింద‌ట‌. అయితే త‌మ అభ్యర్థి విష‌యంలో వైసీపీ త‌ప్పట‌డుగు వేసిందంటూ కొంద‌రు జ‌గ‌న్ పార్టీ నేత‌లే అంటున్నారు. మొద‌టి నుంచీ టీడీపీకి కంచుకోట అయిన హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి బాల‌య్య భ‌విష్యత్తు ఎలా ఉందో తెలియాల్సి ఉంది. 

ఇక రెండు చోట్ల పోటీ చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్, భీమ‌వ‌రంలో గెల‌వ‌డం క‌ష్టమ‌ని చాలా మంది అభిప్రాయ ప‌డుతున్నారు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాసును ఎదుర్కోవ‌డం అంత సులువు కాద‌ని చాలా మంది చెబుతున్న మాట‌. ఇక వైసీపీ కూడా గాజువాక‌లో ఓ అంశాన్ని తెగ ప్రచారం చేసింద‌ట‌. గాజువాక నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలిచినా, ఆ త‌ర్వాత రాజీనామా చేస్తార‌నీ, అలాంట‌ప్పుడు ఆయ‌న‌కు ఎందుకు ఓటు వేయాలంటూ జ‌నం ద‌గ్గర ఊద‌ర‌గొట్టారు వైసీపీ నేత‌లు. ఒక‌వేళ ఈ ప్రచారాన్ని జనం న‌మ్మితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్తితి ఏంటో అర్థం కాకుండా ఉంది. 

ఇక న‌ర్సాపురం నుంచి పోటీ చేసిన నాగ‌బాబు ప్రచారంలోనే త‌డ‌బ‌డ్డార‌ట‌. పోటీపోటీగా దూసుకెళ్తున్న వైసీపీ, టీడీపీల‌ను ఎదుర్కోవ‌డంలో ఆయ‌న విఫ‌లం అయిన‌ట్లు కూడా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రచారం జ‌రుగుతోంది. దీన్నిబ‌ట్టి చూస్తుంటే సినీ గ్లామ‌ర్ అనేది ప్రచారంలో ఓ భాగ‌మే కానీ, దాన్నే న‌మ్ముకుంటే వ‌ర్కవుట్ కాద‌ని అర్థం అవుతోంది. ఇక ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ఈ న‌లుగురు సినీ తార‌ల్లో విజ‌యం ఎవ‌రివైపు ఉందో తేలిపోతుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle