newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆ త‌ల‌నొప్పి ఇప్పుడే వ‌ద్ద‌నుకుంటున్నారా..?

02-12-201902-12-2019 08:35:38 IST
2019-12-02T03:05:38.757Z02-12-2019 2019-12-02T02:40:25.281Z - - 04-08-2020

ఆ త‌ల‌నొప్పి ఇప్పుడే వ‌ద్ద‌నుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టి ఆరు నెల‌లు గ‌డిచిపోయింది. ఆరు నెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాన‌ని ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునే చెప్పిన జగ‌న్‌, ఇందుకోసం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో ప్ర‌ధానమైన కొత్త జిల్లాల ఏర్పాటుకు మాత్రం అడుగులు ముందుకు ప‌డ‌టం లేదు.

తాను అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో పాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాన‌ని, ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈ హామీ ఇచ్చారు. కొన్నింటికి పేర్ల‌ను కూడా ఆయ‌న చెప్పారు. ఎన్టీఆర్, అల్లూరి సితారామ‌రాజు పేర్ల‌తో జిల్లాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై జ‌గ‌న్ కొంత క‌స‌ర‌త్తు చేశారు. దీంతో ప్రాంతాన్ని ప్ర‌త్యేక జిల్లా చేయాలనే డిమాండ్లు వ‌చ్చాయి. అప్పుడ‌ప్పుడే పాల‌నా వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టు సంపాదిస్తున్న జ‌గ‌న్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కానీ, వైసీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులు మాత్రం జిల్లాల ఏర్పాటు హామీల‌ను ఇంకా ఇస్తూనే ఉన్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నెల రోజులకే ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆయ‌న ప్ర‌భుత్వంపై యుద్ధాన్ని ప్ర‌క‌టించాయి. ఏ చిన్న అంశం దొరికినా జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఉద్య‌మాల‌కే దిగుతున్నాయి పార్టీలు. పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నెగ‌టీవ్ క్యాంపెయిన్ జ‌రుపుతున్నాయి. జ‌గ‌న్ ఎక్క‌డ చిన్న త‌ప్పు చేసినా క్యాష్ చేసుకోవ‌డానికి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన సిద్ధంగా ఉన్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకోవ‌డం ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చుకోవ‌డ‌మే అవుతుంది. ఇందుకు తెలంగాణ అనుభ‌వాలే ఉదాహ‌ర‌ణ‌. తెలంగాణ‌లో 10 జిల్లాల‌ను 20 జిల్లాలు చేయాల‌నేది మొద‌ట ఆలోచ‌న‌. కానీ, ఒక్క‌సారి ఈ ప్ర‌క్రియ మొద‌లుకాగానే పెద్ద ఎత్తున డిమాండ్లు పెరిగాయి. త‌మ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు, పార్టీలు జేఏసీలుగా ఏర్పడి ఉద్య‌మాలు చేశారు. దీక్ష‌ల‌కు దిగారు.

ఇది రాజ‌కీయంగా టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టే అంశం కావ‌డంతో డిమాండ్ల‌కు త‌లొగ్గి 33 జిల్లాలు చేయాల్సి వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఇటువంటి ప‌రిస్థితే త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఇక‌, జ‌గ‌న్ అనుకున్న‌ట్లుగా పార్ల‌మెంటు కేంద్రాల‌ను జిల్లాలుగా చేయ‌డం కూడా భౌగోళికంగా స‌మ‌స్య‌లు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక‌లు అందాయి.

ఇప్పుడిప్పుడే పాల‌న గాడిలో ప‌డుతున్న స‌మ‌యంలో కొత్త జిల్లాల ఏర్పాటు హామీని వాయిదా వేయ‌డ‌మే స‌రైన‌ద‌నే నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఇంత‌లో స్థానిక సంస్థ‌లు, గ్రామ పంచాయితీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఏ లెక్క‌న చూసినా మ‌రో ఏడాది వ‌ర‌కు కొత్త జిల్లాల ఏర్పాటు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle