newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఆ త్రిమూర్తుల్ని ఓడించడం బాబు తరం కాదా?

26-04-201926-04-2019 07:44:35 IST
Updated On 04-07-2019 11:37:34 ISTUpdated On 04-07-20192019-04-26T02:14:35.662Z26-04-2019 2019-04-26T02:14:02.117Z - 2019-07-04T06:07:34.934Z - 04-07-2019

ఆ త్రిమూర్తుల్ని ఓడించడం బాబు తరం కాదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కొత్త‌లో ఆ పార్టీకి సీనియ‌ర్ల కొర‌త ఉండేది. అసెంబ్లీలోనూ ఈ కొర‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌త ఎన్నిక‌ల స‌మయంలో కొంద‌రు, ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేత‌లు పార్టీలోకి రావ‌డం వ‌ల్ల ఆ పార్టీకి ఈ కొర‌త కొంత మేర తీరిందనే చెప్పాలి. ముఖ్యంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వంటి సీనియ‌ర్లు, ప్ర‌జాబ‌లం ఉన్న‌వారు ఇప్పుడు జ‌గ‌న్ వ‌ద్ద ఉండ‌టం వైసీపీకి కొంత మేలయ్యింది.

శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, నెల్లూరు జిల్లాలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి కాంగ్రెస్ హ‌యాంలో ప‌దేళ్ల పాటు చ‌క్రం తిప్పారు. వారి నియోజ‌క‌వ‌ర్గాలే కాకుండా ఆయా జిల్లాల్లోని మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వీరి ప్ర‌భావం ఉంటుంది. వీరిలో ధ‌ర్మాన ఎన్నిక‌ల ముందే వైసీపీలో చేర‌గా బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత‌, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఏడాది క్రితం పార్టీలో చేరారు.

ఈ ముగ్గురూ జ‌గ‌న్‌కు కూడా పార్టీ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ ఈ ముగ్గురినీ మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డం ఖాయం. దీంతో వైసీపీలో కీల‌కంగా ఉన్న వీరు ముగ్గురినీ ఓడించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అయితే, ఆయ‌న వ్యూహాలు పెద్ద‌గా ఫ‌లించిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన కురుగుంటి రామ‌కృష్ణ పోటీ చేశారు. అయితే, ఆనం వెంక‌ట‌గిరిలో అడుగుపెట్టాక ప‌రిస్థితులు ఆయ‌న‌కు అనుకూలంగా మారాయి. ఆయ‌న‌కు ఇక్క‌డ కూడా బ‌ల‌మైన అనుచ‌ర‌వ‌ర్గం ఉండ‌టం, సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు ఉండ‌టం ఆనంకు క‌లిసొచ్చింది. ఇక‌, ప‌దేళ్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రామ‌కృష్ణ‌పై స‌హ‌జంగానే ఉండే వ్య‌తిరేక‌త‌, నెల్లూరు జిల్లాలో వైసీపీ బ‌లంగా ఉండ‌టంతో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డికి ఈసారి విజ‌యం ప‌క్కా అనే అంచ‌నాలు ఉన్నాయి. మంచి మెజారిటీతో ఆనం గెలుస్తారని వెంకటగిరి వాసులే చెబుతున్నారు. అందరితో కలివిడిగా ఉండడం కూడా ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇక, చీపురుప‌ల్లిలో మ‌రో సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా గెలుపు పెద్ద క‌ష్ట‌మేమీ కాదంటున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కూడా 42 వేల‌కు పైగా ఓట్లు సంపాదించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న బ‌ల‌మైన నేత కావ‌డం, వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకుకు పార్టీ ఓట్లు కూడా తోడ‌వుతుండ‌టంతో ఈసారి ఆయ‌న గెలుపు ఖ‌యామ‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున మాజీ మంత్రి క‌మిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేశారు. అయితే, ఆయ‌న‌కు మొద‌టి ఓ వ‌ర్గం నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. ఆయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉన్నా విజ‌యం మాత్రం బొత్స‌దే అంటున్నారు.

శ్రీకాకుళంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి గుండా ల‌క్ష్మీదేవి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. అంత‌కుముందు ప‌దేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ధ‌ర్మాన‌పై వ్య‌తిరేక‌త ఉండ‌టం, ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం, జిల్లా వ్యాప్తంగా టీడీపీ హ‌వా ఉండ‌టంతో ఆ ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ధ‌ర్మాన ప‌రిస్థితి మెరుగ్గానే ఉంది. టీడీపీ - వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు ఉన్నా స్వ‌ల్ప మెజారిటీతో అయినా ధ‌ర్మాన ఈసారి విజ‌యం సాధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మొత్తంగా ఈ ముగ్గురు సీనియ‌ర్ల‌ను అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వ‌ద‌ని చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నినా అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదని సర్వేలు నొక్కివొక్కాణిస్తున్నాయి. వీరు వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రులుగా ఉండ‌టం ఖాయం. వీరిని ఓడించాలని అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించినా..అవన్నీ వృథా అవుతున్నాయని వైసీపీ వర్గాలే అంటున్నాయి. 

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle