newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఆ జిల్లాలో తెలుగుదేశం ఇక గ‌తం..?

08-09-201908-09-2019 09:50:18 IST
2019-09-08T04:20:18.777Z08-09-2019 2019-09-08T04:19:57.006Z - - 28-05-2020

ఆ జిల్లాలో తెలుగుదేశం ఇక గ‌తం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో చ‌రిత్ర‌లో ఎరుగ‌ని దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న తెలుగుదేశం పార్టీ త్వ‌ర‌గానే కోలుకుంది. నెల రోజుల‌కే ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించింది. ఓట‌మితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడ‌ర్‌కు చంద్ర‌బాబు నాయుడు ఆత్మ‌స్థైర్యం నింపుతున్నారు. అయితే, చంద్ర‌బాబు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాలు అంత‌టా ఎంతో కొంత ఫ‌లిత‌మిస్తున్నా రాయ‌ల‌సీమ‌లో మాత్రం పనిచేయ‌డం లేదు.

సీమ‌లోని 51 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవ‌లం మూడు స్థానాల‌కే ప‌రిమితం అయ్యింది. దీంతో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పూర్తిగా ఢీలా ప‌డిపోయారు. దీంతో పార్టీ సీమ నేత‌ల్లో చాలా మంది యాక్టీవ్‌గా రాజ‌కీయాలు చేయ‌డం లేదు.

ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇక గ‌త‌మేనా అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. ఎన్నిక‌ల ముందు పార్టీ త‌ర‌పున వైసీపీతో పోరుకు తొడ‌లు కొట్టిన నేత‌లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి ముందు నుంచీ కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. ప‌ది సీట్లు ఉన్న ఈ జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని ఇంత‌కాలం అనేక క‌ష్టాల‌కు ఓర్చి టీడీపీ నేత‌లు పోరాడారు.

దీంతో ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఒక‌టో, రెండో సీట్లు టీడీపీ గెలుస్తూ వ‌స్తోంది. అయితే, ఈ ఎన్నిక‌లు మాత్రం జిల్లా టీడీపీ నేత‌లకు మింగుడుప‌డ‌టం లేదు. క‌డ‌ప జిల్లాలో పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని, పార్టీలో ఉంటే త‌మ‌కూ భ‌విష్య‌త్ ఉండ‌దనే బెంగ ఆ పార్టీ నేత‌ల‌ను వెంటాడుతోంది.

వాస్త‌వానికి ఎన్నిక‌ల ముందే జిల్లాలో ప్ర‌జ‌ల మూడ్‌ను గుర్తించిన కొంద‌రు నేత‌లు వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. 2014లో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకొని గెలిచారు.

సీనియ‌ర్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి కూడా వైసీపీలో చేరారు. చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడైన సీఎం ర‌మేశ్ ఎన్నిక‌ల ముందు జిల్లాలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించి.. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలో చేరిపోయారు.

క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీలో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇక‌, గ‌త మూడేళ్లు వైసీపీతో ఢీ అంటే ఢీ అన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీలో చేరనున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌ను పిలిపించుకొని బుజ్జ‌గించినా ఆయ‌న విన‌లేదు. క‌డ‌ప‌లో వైసీపీని త‌ట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క‌టే మార్గం అని ఆయ‌న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత రామ‌సుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడ‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆయ‌న వైసీపీలో చేరుతార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల అమెరికా వెళ్లిన జ‌గ‌న్‌ను ఆయ‌న అక్క‌డే క‌లిసి పార్టీలో చేరిక‌కు లైన్‌క్లీయ‌ర్ చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ జీరో అయిన‌ట్లే. ప‌రిస్థితి ఇలానే ఉంటే క‌డ‌ప జిల్లాలో టీడీపీ ఇక గ‌తంలా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   10 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   10 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   18 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle