newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఆ జిల్లాలో టీడీపీ గోవిందా.. గోవిందా!

30-10-201930-10-2019 10:29:42 IST
Updated On 30-10-2019 15:41:38 ISTUpdated On 30-10-20192019-10-30T04:59:42.543Z30-10-2019 2019-10-30T04:59:40.895Z - 2019-10-30T10:11:38.084Z - 30-10-2019

ఆ జిల్లాలో టీడీపీ గోవిందా.. గోవిందా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట‌మిని చిత్తూరు టీడీపీ త‌ట్టుకోలేక‌పోతోంది. ఆ జిల్లా నేత‌ల మొత్తం సైలెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. క‌నీసం త‌మ నేత‌లు రింగ్‌టోన్ వినిపిస్తే వాలిపోదామ‌ని కేడ‌ర్ ఎదురు చూస్తున్నా నేత‌లు మాత్రం సైలెంట్ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో చిత్తూరు జిల్లా నేత‌ల‌కు ఏమైందన్న చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో విస్తృతంగా కొన‌సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత చిత్తూరు టీడీపీలో యాక్టివిటీస్ బాగానే త‌గ్గాయి. ఆఖరకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో ఎక్క‌డా పార్టీలో హ‌డావుడి క‌నిపించ‌డం లేదు. మ‌రోప‌క్క గత ఎన్నిక‌ల్లో పోటీచేసిన నేత‌లు కేడ‌ర్‌కు అందుబాటులో లేకుండా పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కుప్పం నుంచి టీడీపీ త‌రుపున చంద్ర‌బాబు మాత్ర‌మే గెలిచారు. మిగ‌తా ఎవ్వ‌రూ గెల‌వ‌లేదు. చంద్ర‌బాబు జిల్లాపై ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో నేత‌లు యాక్టివిటీస్ త‌గ్గించారు. ఇటు కేడ‌ర్ కూడా డ‌ల్ అయిపోయింది. తిరుప‌తి నుంచి పోటీచేసిన సుగుణ‌మ్మ తిరుప‌తిలోనే ఉంటున్నారు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాలు తూతూ మంత్రంగా నిర్వ‌హిస్తున్నారు.

న‌గ‌రిలో భానుప్ర‌కాష్ కార్య‌క్ర‌మాలేవీ చేయ‌డం లేదు. శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి పోటీచేసిన బొజ్జ‌ల సుధీర్ హైద‌రాబాద్‌కు ప‌రిమిత‌మ‌య్యారు. చంద్ర‌గిరి అభ్య‌ర్ధి పురి నాని నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న్ను జిల్లా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని పార్టీలోని కొంద‌రు నేత‌లు కోరుతున్నారు.

పీలేరులో న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ప‌ల‌మ‌నేరుకు చెందిన అమ‌ర్‌నాథ్‌రెడ్డి వారి వారి బిజినెస్‌లు చూసుకుంటున్నారు. తంబ‌ళ్ల‌ప‌ల్లి శంక‌ర్‌యాద‌వ్ బెంగ‌ళూరులోనే ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంవైపు చూడ‌టం లేదు. పూత‌ల‌ప‌ట్టు, గంగాధ‌రం నెల్లూరు, స‌త్య‌వేడు నుంచి పోటీచేసిన ల‌లిత కుమారి, హ‌రికృష్ణ‌, రాజ‌శేఖ‌ర్‌లు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. కానీ కేడ‌ర్‌లో మాత్రం క‌ల‌వ‌డం లేదు.

వైసీపీ దూకుడుకు కేడ‌ర్ మొత్తం చెల్లా చెదురు అవుతోంది. వారిని ఒక‌తాటిపై న‌డిపించే నేత లేక‌పోవ‌డం ఇప్పుడు లోటుగా మారింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే నెల‌లో జిల్లా ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. జిల్లా కేడ‌ర్‌కు భ‌రోసా ఇచ్చే నేత‌ను ఈ మీటింగ్‌లో ఎంపిక చేస్తార‌ని తెలుస్తుంది. ఏదేమైనా జిల్లాలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత వేగ‌వంతం చేసి రానున్న ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేలా ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించాల‌ని కార్య‌క‌ర్తలు కోరుతున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle