newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఆ జనం టీడీపీని భయపెడుతున్నారా?

05-04-201905-04-2019 09:25:13 IST
2019-04-05T03:55:13.583Z05-04-2019 2019-04-05T03:55:09.392Z - - 26-06-2019

ఆ జనం టీడీపీని భయపెడుతున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మ ముగ్గురి ప్రచార సభల్నీ.. ఆ సభలకు వచ్చే జనాన్నీ చూస్తే చాలు ఆ రాత్రి టీడీపీ నేతలకు నిద్రపట్టదు. అందుకే ఈ జనం నిజమైన జనం కాదు మొత్తం గ్రాఫిక్స్ అన్న ప్రచారం మొదలు పెట్టారట చంద్రబాబు. ఈ జనమే ఇప్పుడు టీడీపీ కేడర్‌ను విపరీతంగా భయపెడుతోందట. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి సభలకే ఎక్కువ మంది ప్రజలు వస్తారు,

షర్మిల, విజయమ్మల సభలకు జగన్‌తో పోల్చితే పెద్దగా రాకపోవచ్చన్న అభిప్రాయం వైసీపీలోనూ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని స్థాయిలోనే షర్మిల, విజయమ్మ ప్రసంగాలు వినేందుకు జనం భారీగా తరలిరావడం తెలుగు  తమ్ముళ్ళకు వణుకు పుట్టిస్తోంది. 

ముఖ్యంగా విజయమ్మ ప్రసంగాలు సొంత ఇంట్లోని మనిషే మాట్లాడుతున్నంత హత్తుకునేలా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల లోకేష్, చంద్రబాబుపై వేసే పంచ్ డైలాగులు, తూటాల్లాంటి ఆమె మాట విరుపుల్ని వినేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. బైబై బాబు అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లిందంటే.. షర్మిల ప్రతి ప్రసంగం చివర్లోనూ బైబై బాబూ అంటూ చెప్పడమే కారణం.. ఈ నినాదాలతో ఏకంగా టిక్ టాక్ వీడియోలు కూడా సందడి చేస్తున్నాయి.

Image may contain: 3 people, people sitting

సోషల్ మీడియాలోనూ వీరి ప్రసంగాలు వినేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతుండటం, ఎక్కడ చూసినా రావాలి జగన్ కావాలి జగన్ నినాదాలు వినిపిస్తుండటం చూసి టీడీపీ కాన్ఫిడెన్స్ కోల్పోయింది. అందుకే చాలా మంది టీడీపీ అభ్యర్థులకు ఓటమి తథ్యమని అర్థమైపోయిందట. అలాంటి వారు డబ్బు పంచడం కూడా వృథా అనుకుంటున్నారు. ఇక తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్న వారు మాత్రం కోట్లకు కోట్లు పంచిపెడుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle