newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఆ గట్టునుంటావా.. మా గట్టుకొస్తావా?

04-12-201804-12-2018 16:18:31 IST
Updated On 04-12-2018 16:23:15 ISTUpdated On 04-12-20182018-12-04T10:48:31.550Z04-12-2018 2018-12-04T10:48:29.200Z - 2018-12-04T10:53:15.601Z - 04-12-2018

ఆ గట్టునుంటావా.. మా గట్టుకొస్తావా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో త్వరలో ఎన్నికలకు ముహూర్తం రాబోతోంది. ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా త్వరగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో వివిధ పార్టీలు తమకు అనుకూలమయిన పార్టీలతో అవగాహనకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉండీ లేనట్టుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు త‌మ కార్యాచ‌ర‌ణ‌పై అయోమ‌య‌ంలో పడ్డాయి. ఏపీలోని సీపీఎం, సీపీఐ పార్టీలతో ఎవ‌రితో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ వైసీపితో క‌లిసి ప్రజాపోరాటాలు చేసిన క‌మ్యునిస్టు పార్టీలు తాజాగా జనసేనానితో  క‌లిసి నడుస్తున్నాయి.  వైసీపితో క‌లిసి చంద్రబాబుని ఓడిస్తామంటూ హ‌డావుడి చేసిన కమ్యూనిస్టులు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల అనంత‌రం వైసీపీకి దూర‌మ‌య్యారు. నాటి నుంచి జ‌న‌సేనతో క‌లిసి ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటాలు సాగించారు. ఈ నేపధ్యంలో సిపిఎం, సిపిఐ, జ‌న‌సేనల క‌ల‌యిక‌తోనే రాజ‌కీయ ప్రత్యామ్నాయం సాధ్యమంటూ ప్రచారం సాగించారు. జ‌న‌సేన‌తో పోటీ చేస్తామంటూ లెప్ట్ నేత‌లు అంటున్నా జనసేన నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తెలంగాణలో కూడా ఇదే వైఖరి ప్రదర్శించారు. చివరకు లెఫ్ట్ పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మిగిలిపోయాయి. సీపీఎం.. బీఎల్ఎఫ్‌తో కలిసి తెలంగాణలో పోటీచేసింది. సీపీఐ మాత్రం ప్రజాకూటమితో కలిసి నడుస్తోంది. వారంలో రంపచోడవరం పర్యటనలో పవన్‌ సభలో పాల్గొన్న కమ్యూనిస్టులు పొత్తులపై ప్రకటన వస్తుందని ఆశించారు. అయినా ఎలాంటి ప్రకటన రాకపోగా 2019 ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేస్తామంటూ జనసేన ప్రకటించడం అగ్రనేతలను ఆలోచనల్లో పడేసింది. ఒంటరిగా పోటీ చేసే పరిస్ధితులు లేకపోవడం, జట్టుకట్టేందుకు మిత్రులు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై కమ్యూనిస్టులు దృష్టి పెట్టారు.

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న తమను పవన్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇరు పార్టీలు వాపోతున్నాయి. తాము కావాలని కోరుకుంటుంటే.. పవన్ తమను దూరంగా ఉంచుతున్నాడని సీపీఐ నేతలు వాపోతున్నారు. ఏపీలో జరిగే ప్రతి ఉద్యమానికి తాము మద్ధతిచ్చినా..తమ కార్యక్రమాల్లో కనీస భాగస్వామ్యం లేకుండా పవన్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అటు పార్టీకి ఇటు కేడర్‌కు ఇలాంటి పరిస్ధితి మంచిది కాదంటున్నారు. పొత్తులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ అధినాయకత్వానికి సూచిస్తున్నారు. తెలంగాణలో జనసేన పరిస్థితిలా తాము రెండింటికి చెడ్డ రేవడిలా మారకూడదంటున్నారు. ఒకవేళ పవన్ బీజేపీతో కలిసి నడిస్తే తమ దారిలో తాము వెళతామంటున్నారు. గతంతో పోలిస్తే జనసేనకు నేతల వలసలు పెరిగాయని, అంత మాత్రాన కలిసి వస్తానని స్నేహహస్తం అందించే మిత్రుడిని దూరంగా చేసుకుంటారా అని లెఫ్ట్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జనసేన తీసుకునే నిర్ణయంమీద లెఫ్ట్ పార్టీ ప్రయాణం ఆధారపడి ఉంటుందంటున్నారు. ఒకవేళ పవన్ కాదంటే విధిలేని పరిస్థితుల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్-టీడీపీ కూటమితో చేతులు కలుపుతారేమో అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle