newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆ ఒక్కటి తప్ప...నెల్లూరు అంతా జగన్ !

27-03-201927-03-2019 09:20:04 IST
Updated On 28-03-2019 17:06:12 ISTUpdated On 28-03-20192019-03-27T03:50:04.787Z27-03-2019 2019-03-27T03:50:01.616Z - 2019-03-28T11:36:12.946Z - 28-03-2019

ఆ ఒక్కటి తప్ప...నెల్లూరు అంతా జగన్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లా ప్రజలు వైసీపీకి జైకొడుతున్నారు. ఈసారి జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మినహా అంతటా ఫ్యాను.. ఫుల్ స్పీడుతో తిరుగుతోంది. వైఎస్సార్సీపీకి కడప జిల్లా ఎంతో నెల్లూరూ జిల్లా కూడా అంతే. గత ఎన్నికల్లో మొత్తం పది నియోజకవర్గాల్లో ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. 3 చోట్ల మాత్రమే సైకిల్ తిరగ గలిగింది. అంతటి కేడర్, వైఎస్ అభిమానులు ఈ జిల్లాలో ఉన్నారు. ఈసారి జగన్ వైపు వీస్తున్న ప్రజా గాలులు సైకిల్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి.

ఈ జిల్లాలోని బలమైన టీడీపీ నాయకులతో సహా అంతా ఓటమిపాలవుతారని స్థానికంగా టీడీపీ చేయించిన ఫోన్ కాల్ సర్వేల్లో కూడా తెలిసిపోయిందట. నెల్లూరు జిల్లాలో సైకిల్ కొద్దో గొప్పో తిరిగే నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆత్మకూరు మాత్రమేనని తెలుస్తోంది. ఆత్మకూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేకపాటి గౌతమ్ రెడ్డిపై ఓ వర్గంలో వ్యతిరేకత పెరిగింది. ఈ నియోజకవర్గంలో పాలక టీడీపీ అభివృద్ధి నిధులు కేటాయించడంలోనూ, పనులు చేయించడంలోనూ పెద్దగా దృష్టిపెట్టకపోవడం కూడా మేకపాటిపై పెరిగిన వ్యతిరేకతకు కారణం. 

మరో ముఖ్య కారణం.. ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల అనే మండలంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన బలమైన వ్యక్తులు ఉన్నారు. వీరి ప్రభావం నియోజకవర్గంపై ఎక్కువ. వాళ్లంతా ఈ సారి చంద్రబాబు వైపు నిలుస్తున్నారు. దీంతో ఒక్క ఆత్మకూరు తప్ప నెల్లూరు జిల్లాలోని మిగతా 9 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీపై ఇంతటి వ్యతిరేకత ఉండటం వల్లే ఆ పార్టీతో లోపాయకారి ఒప్పందం ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా ప్రచారంలో నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని పదే పదే చెప్పారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle