newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆ ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు గ్యారెంటీ..?

07-07-202007-07-2020 08:04:29 IST
2020-07-07T02:34:29.790Z07-07-2020 2020-07-07T02:32:36.127Z - - 08-08-2020

ఆ ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు గ్యారెంటీ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకు గానూ ఆయ‌న ముహూర్తం కూడా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆషాడ‌ మాసం కాబ‌ట్టి 21వ తేదీన ఆషాడం పోయి శ్రావ‌ణ మాసం రాగానే 22న క్యాబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌నే నిర్ణ‌యం జ‌రిగింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ప‌త్రిక‌లోనే ఈ నెల 22వ తేదీన కొత్త మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంద‌ని వార్త రావ‌డంతో డేట్ ఫిక్స్ అయిన‌ట్లే అర్థం చేసుకోవాలి.

ఏడాది క్రితం ఎన్నిక‌ల్లో గెల‌వ‌గానే ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. 151 సీట్ల‌తో అధికారంలోకి రావ‌డంతో మంత్రి ప‌దవుల కోసం చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ ప‌డ్డారు. అయితే, విశ్వ‌స‌నీయత‌‌, సామాజ‌క న్యాయం, స‌మ‌ర్థ‌త అనే మూడు అంశాల‌ను చూసి మంత్రి ప‌దవులు ఇచ్చారు జ‌గ‌న్‌. ఇందులో భాగంగా క‌ష్టాల్లో త‌న‌తో పాటు వెంట న‌డిచి మంత్రి ప‌ద‌వుల‌ను కోల్పోయిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు జ‌గ‌న్.

అయితే, రెండున్న‌రేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణను రాజ్య‌స‌భ‌కు పంపించ‌డంతో రెండు మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి. వీరిద్ద‌రూ ఇటీవ‌లే ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు, మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా కూడా చేసేశారు. దీంతో వీరి స్థానంలో జ‌గ‌న్ 22న ఎవ‌రిని మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రెండు ప‌ద‌వుల కోసం చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ ప‌డుతున్నారు.

అయితే, సామాజిక‌న్యాయానికి పెద్ద పీట వేస్తున్న జ‌గ‌న్ ఈ రెండు ప‌ద‌వుల‌ను బీసీల‌తో భ‌ర్తీ చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పైగా సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ సామాజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారితోనే వీరి స్థానాల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. త‌ద్వారా ఆయా సామాజిక వర్గాల వారు మంత్రివ‌ర్గంలో ఉండేలా చూడాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ది శెట్టి బ‌లిజ సామాజిక‌వ‌ర్గం కాగా మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మ‌త్య్స‌కార సామాజి‌క‌వ‌ర్గానికి చెందిన వారు.

దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజ‌కవ‌ర్గాల‌కు చెందిన నేత‌లు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఈ సామాజ‌క‌వ‌ర్గాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేక‌పోవ‌డంతో పోటీ త‌క్కువ‌గానే ఉంది. మ‌త్య్స‌కార సామాజి‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే రాష్ట్రంలో ఆ సామాజి‌క‌వ‌ర్గం నుంచి తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మ‌డివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్‌, శ్రీకాకుళం జిల్లా ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల్రాజు మాత్ర‌మే ఉన్నారు. వీరిద్ద‌రూ మంత్రి ప‌ద‌విపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, పొన్నాడ స‌తీష్ రెండోసారి ఎమ్మెల్యే కావ‌డం, అప్ప‌ల్రాజు మొద‌టిసారి ఎమ్మెల్యే కావ‌డంతో పొన్నాడ‌కే ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉండ‌వ‌చ్చు.

కాగా, మంత్రి ప‌ద‌వి వ‌దులుకున్న సుభాష్ చంద్ర‌బోస్‌ది శెట్టి బ‌లిజ సామాజి‌క‌వ‌ర్గం. తూర్పు గోదావ‌రి జిల్లా. ఒక‌వేళ అదే సామాజి‌క‌వ‌ర్గం నుంచి, అదే జిల్లా నుంచి ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేయాలంటే రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చు. అప్పుడు ఇదే జిల్లాకు చెందిన పొన్నాడ స‌తీష్‌కు ఛాన్స్ దొర‌క‌డం క‌ష్టం.

ఇదే జ‌రిగితే ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల్రాజుకు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం దొర‌క‌వ‌చ్చు. ఇలా రెండు మంత్రిప‌ద‌వుల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంది. ఈ ముగ్గురిలో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డం ఖాయంగా చెబుతున్నారు. మ‌రి, ఈ ముగ్గురిలో ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు వ‌రిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

   7 hours ago


 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   13 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   14 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   15 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   16 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   17 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   17 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   17 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   18 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle