newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఆ ఇద్దరు సెంటిమెంటును బ్రేక్ చేస్తారా..?

11-04-201911-04-2019 09:13:50 IST
Updated On 06-07-2019 15:54:38 ISTUpdated On 06-07-20192019-04-11T03:43:50.125Z11-04-2019 2019-04-11T03:43:19.189Z - 2019-07-06T10:24:38.494Z - 06-07-2019

ఆ ఇద్దరు సెంటిమెంటును బ్రేక్ చేస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల్లో సెంటిమెంట్లు కాస్త ఎక్కువే ఉంటాయి. కొందరు నేతలకు ప్రజా బలం ఉన్నా సెంటిమెంట్లు దెబ్బ తీస్తుంటాయి. యాధృచ్చికమో, ఇంకేమైనా కారణమో కానీ సెంటిమెంట్ల వల్ల కొందరు నేతలు రాజకీయంగా ఎదగలేకపోయారు. ఇటువంటి నేతల్లో ఒకరు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు లక్ అస్సలు కలిసిరావడం లేదు. ఐదుసార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిన ఆయనకు అన్ని అర్హతలు ఉన్నా మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. 

రాష్ట్రమంతా టీడీపీకి ఎదురుగాలి వీచిన సందర్భాల్లో ఆయన ఉరవకొండ నుంచి 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. అంతకుముందే అయన 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి దక్కి ఉండేది. ఎదురుగాలిలోనూ గెలిచినా అయన గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ హవా ఉన్నా ఓడిపోయారు.

దీంతో మంత్రి పదవి మిస్ చేసుకున్నారు. తర్వాత ఆయనను చంద్రబాబు గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి విప్ పదవి కూడా కట్టబెట్టారు. ఎమ్మెల్యేకు సమానంగా పవర్ సెంటర్‌గా పనిచేసిన కేశవ్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డికి పార్టీలో విభేదాలు తలనొప్పిగా మారాయి. 

దీంతో ఈసారి గెలిచేందుకు కేశవ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి గెలిచి, పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయం. ఒకవేళ మళ్లీ  సెంటిమెంట్ రిపీట్ అయ్యి అయన గెలిచినా పార్టీ అధికారం లోకి రాకపోతే మాత్రం అయన దురదృష్టం అనే చెప్పాలి.

కృష్ణా జిల్లాలోనూ ఇటువంటి సెంటిమెంట్ ఎదుర్కుంటున్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రమంతా పార్టీకి వ్యతిరేఖ పవనాలు వీచినా అయన మాత్రం టీడీపీ తరపున విజయం సాధించారు. 2014కు ముందు అయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మళ్లీ 2014 ఎన్నికల్లో గెలిచినా వైసీపీ మాత్రం అధికారం లోకి రాలేదు. అయన మూడుసార్లు గెలిచినా అయన ఉన్న పార్టీలు అధికారంలోకి రాకపోవడంతో రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లలేక పోయారు.

ఈసారి ఆయన మళ్లీ గుడివాడ నుంచి బరిలో ఉన్నారు. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావడం, ప్రజల్లో ఉండటంతో ఆయనకు ఈసారి కూడా విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈసారి కూడా అయన గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయం అంటున్నారు. మరి, ఈసారైనా కొడాలి నాని సెంటిమెంటును బ్రేక్ చేస్తారా చూడాలి.

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   10 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   10 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   18 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle