newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు?

08-07-201908-07-2019 09:38:01 IST
Updated On 08-07-2019 10:30:36 ISTUpdated On 08-07-20192019-07-08T04:08:01.353Z08-07-2019 2019-07-08T04:07:57.000Z - 2019-07-08T05:00:36.139Z - 08-07-2019

ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ‘తానా’ వేదికగా బీజేపీ కొత్త రాజకీయాలు చేస్తోంది. ఇద్దరు తెలుగు నేతలు అక్కడ హాట్ టాపిక్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్-బీజేపీ నేత రాంమాధవ్ ల మధ్య జరగిన చర్చలపైనే అంతా చర్చించుకుంటున్నారు. 

‘ఆపరేషన్ ఆకర్ష్‌’తోపాటు పార్టీ విలీనాలకు చర్చకు తానా సభనే వేదిక చేసుకున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలతో పాటు పలు రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. భవిష్యత్తు రాజకీయాలకు ‘తానా’ వేదికగా జరిగిన చర్చలే నాంది పలకబోతున్నాయా..? అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతంగా సాగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులను సైతం బీజేపీ లాగేసుకుంది.

తాజాగా అమిత్ షా సమక్షంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో అక్కడక్కడా మిగిలిన తెలంగాణ టీడీపీ నేతలను బీజేపీ ఆకర్షించింది. తాజాగా రాంమాధవ్ తో చర్చలతో ఏపీలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మళ్ళీ దగ్గరవుతున్నట్టు అర్థం అవుతోంది.

2014లో టీడీపీ, బీజేపీతో కలిసి తిరిగారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో పోటీచేయకపోయినా చంద్రబాబు అధికారంలోకి రావడానికి పవన్ దోహదం చేశారు. 2019లో స్వంతంగా పోటీచేసిన పవన్ ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అటు బీజేపీ 2014 ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే, 2ఎంపీ సీట్లు గెలుచుకుంది.

2019 ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలబడిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీ మధ్య బంధం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో రెండుపార్టీలు కలుస్తాయంటున్నారు.

టీడీపీని బలహీనపరిచేందుకు ఆ పార్టీలోని అసంతృప్త నేతలను లాగేసే ప్రయత్నంలో ఉంది బీజేపీ. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle