newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆ ఆరు జీవోలు నిలిపివేత.. జగన్ సంచలన నిర్ణయం

07-12-201907-12-2019 12:18:51 IST
2019-12-07T06:48:51.664Z07-12-2019 2019-12-07T06:48:49.380Z - - 05-08-2020

ఆ ఆరు జీవోలు నిలిపివేత.. జగన్ సంచలన నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేదో పథకం గురించి కాదు, తన స్వంత పనులకు ప్రభుత్వ నిధుల వినియోగం గురించి వస్తున్న విమర్శలతో ఆయన కొన్ని జీవోలను నిలుపదల చేశారు.

ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు సంబంధించిన వివిధ పనులకు నిధులు కేటాయిస్తూ గతంలో జారీ చేసిన జీవోలు ప్రస్తుతం నిలిపివేశారు. తాడేపల్లితో పాటు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. 

తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్‌ కొనుగోలు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులను నిలిపివేశారు. దీంతో సుమారు 3 కోట్ల విలువైన పనులకు సంబంధించిన కేటాయింపులు రద్దయ్యాయి. సీఎం నివాసానికి ఏర్పాట్ల కోసం ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్‌ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించిన 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌లోని ఎల్ బ్లాక్‌లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను తొలగించిన సంగతి తెలిసిందే. వీటిని లోటస్‌పాండ్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్/నివాసంలో తిరిగి అమర్చాలని భావించారు. లోటస్‌పాండ్‌లో సీసీ కెమెరాలను రీ ఇన్ స్టాల్ చేస్తామన్నారు. అక్కడ సోలార్ సిస్టమ్‌ను మెరుగుపర్చడానికి  18 లక్షల కేటాయించారు.

లోటస్‌పాండ్ వద్ద బారికేడ్ల నిర్వాహణ కోసం 8 లక్షలు కేటాయించారు. లోటస్‌పాండ్‌ వద్దనున్న పోలీస్ బ్యారక్స్‌కు ఇరువైపులా ఎలక్ట్రికల్ పనుల కోసం నాలుగున్నర లక్షలు కేటాయించారు.

లోటస్‌పాండ్‌లో పర్యవేక్షణకు.. నిష్ణాతులైన ఎలక్ట్రికల్ వర్కర్స్‌ని నియమించడానికి  ఏడాదికి గానూ 4 లక్షలు మంజూరు చేశారు. ఇలా మొత్తం రూ.35.50లక్షలు విడుదల చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో విడుదలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జీవో కూడా నిలిపివేశారు. ఈ జీవోల నిలిపివేత వల్ల ప్రభుత్వానికి మూడుకోట్లకు పైగా ఆదా కానుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle