newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ఆ ఆరుగురే బాబు టార్గెట్

10-03-201910-03-2019 07:59:33 IST
Updated On 11-03-2019 12:37:57 ISTUpdated On 11-03-20192019-03-10T02:29:33.219Z10-03-2019 2019-03-10T02:29:27.180Z - 2019-03-11T07:07:57.317Z - 11-03-2019

ఆ ఆరుగురే బాబు టార్గెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరుగురు వైసీపీ నేతలను టార్గెట్ చేశారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఓడించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ వారెవరో తెలుసా... ఒకరు నగరి ఎంఎల్ఏ రోజా అయితే రెండో వ్యక్తి చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మూడోవ్యక్తి గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని. ఇక నాలుగో వ్యక్తి డోన్ ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్ర రెడ్డి, ఐదో వ్యక్తి నెల్లూరు సిటీ ఎంఎల్ఏ అనిల్ కుమార్ యాదవ్, ఆరవ వ్యక్తి నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

వైసీపీలో కీలకంగా వున్న ఈ నేతలే ఓటమి లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ ఆరుగురిని ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. వచ్చే అసెంబ్లీలో వీరిని తాను చూడకూడదని చంద్రబాబు ఆయా జిల్లా టీడీపీ నేతలకు చెప్పారు. ఎవరు గెలిచినా ఫర్వాలేదు, టీడీపీకి కంట్లో నలుసులా, కాళ్ళో ముల్లులా ఉన్న ఈ ఆరుగురిని ఇంటికి పంపాలని చంద్రబాబు నేతలకు సూచించారట. 

ఇందుకోసం ఆపరేషన్ ఆరుగురు పేరుతో భారీ స్కెచ్ కూడా చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వీరి మీద ఇంత కసి పెంచుకోడానికి కారణం ఒక్కటే. ముఖ్యంగా ఈ ఆరుగురు ఎంఎల్ఏలు మాస్ లీడర్లు. వారి నియోజకవర్గాల్లో తిరుగులేని పట్టు ఉన్నవారు కావడమే. అందుకే చంద్రబాబు ఇంత కష్టపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరి గుడివాడ సిట్టింగ్ ఎంఎల్ఏ కొడాలి నానిని తట్టుకోవడం అవినాష్ వల్ల అవుతుందా అంటే, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారట టీడీపీ నేతలు. తాను ఓడిపోతే గుడివాడ వదిలి వెళ్లిపోతానని అప్పుడెప్పుడో నాని అన్నమాట ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. ఎలాగైనా నానిని ఓడించడం చంద్రబాబు వల్ల అవుతుందా అనేది? ఇప్పుడు గుడివాడ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle