newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఆ అవ‌కాశం ఇవ్వొద్ద‌ని అనుకుంటున్నారా..?

06-01-202006-01-2020 08:44:53 IST
Updated On 06-01-2020 12:31:18 ISTUpdated On 06-01-20202020-01-06T03:14:53.664Z06-01-2020 2020-01-06T03:14:02.603Z - 2020-01-06T07:01:18.725Z - 06-01-2020

ఆ అవ‌కాశం ఇవ్వొద్ద‌ని అనుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఇద్ద‌రు ఎమ్మెల్యేల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌న‌సేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌, గుంటూరు ప‌శ్చిమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర‌రావు బాహాటంగానే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి జై కొడుతున్నా, త‌మ స్వంత పార్టీ అధినేతలపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నా వారిని ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు వారి పార్టీలు.

ఇలాంటి వారిని స‌స్పెండ్ చేయ‌కుండా అనుకుంటే అనుకోనీలే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇందుకు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హార‌మే కార‌ణం.

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీకి రెబ‌ల్‌గా మారారు. పార్టీ అధినేత‌పై, యువ‌నేత నారా లోకేష్‌, ఇత‌ర టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోశారు. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు చంద్ర‌బాబు. వాస్త‌వానికి, అధికారికంగా స‌స్పెన్ష‌న్ చేస్తున్న‌ట్లు ధృవీక‌రించ‌క‌పోయినా వాట్సాప్ ద్వారా స‌స్పెన్ష‌న్ పంపించారు.

అప్ప‌టివ‌ర‌కు వైసీపీలో చేరితే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌స్తుందా అనే డైల‌మాలో ఉన్న వంశీకి ఈ స‌స్పెన్ష‌న్ ఒక అవ‌కాశంగా దొరికింది. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసినందున ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించాల‌ని ఆయ‌న స్పీక‌ర్‌ను కోరి టీడీపీకి పూర్తిగా దూర‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలోనే ప‌ని చేస్తున్నారు. కావాల్సిన నిధులు ప్ర‌భుత్వం నుంచి తెచ్చుకోగ‌లుగుతున్నారు.

వంశీ చూపిన బాట‌లో మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు న‌డుస్తార‌ని అంతా అనుకున్న‌ట్లుగానే టీడీపీ గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. టీడీపీపై, ఆ పార్టీ విధానాల‌పై, చంద్ర‌బాబు వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో ఆయ‌న‌ను వెంట‌నే వంశీలానే పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ, స‌స్పెండ్ చేస్తే ఆయ‌న కూడా వంశీలానే ప్ర‌త్యేక స‌భ్యుడిగా మార‌తాడ‌ని భావించిన చంద్ర‌బాబు ఆ ప‌ని చేయ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గానికి వేరే నేత‌ను ఇంఛార్జిగా పెట్టి గిరి ప‌వ‌ర్‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

చంద్ర‌బాబు త‌న కులానికి ఒక న్యాయం, మ‌రో కులానికి ఇంకో న్యాయం చేస్తున్నార‌ని మ‌ళ్లీ మ‌ద్దాలి గిరి విమ‌ర్శ‌లు చేసినా టీడీపీ కౌంట‌ర్ ఇవ్వ‌కుండా వాటిని వ‌దిలేసింది. ఏమైనా విమ‌ర్శ‌లు చేయ‌నీ కానీ స‌స్పెండ్ చేసేది మాత్రం లేదు అనే నిర్ణ‌యానికి ఆ పార్టీ వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పైగా మ‌ద్దాలి గిరి సాఫ్ట్‌గా వ్య‌హ‌రించే నేత‌. ఆయ‌న వ‌ల్ల‌భ‌నేని వంశీ మాదిరి తీవ్ర ప‌ద‌జాలం వాడ‌రు, తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేయ‌రు. దీంతో ఆయ‌న ఇప్పుడు టీడీపీలో ఉన్నా.. లేన‌ట్లే అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది.

జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ది కూడా ఇదే వైఖ‌రి. ఆయ‌న మ‌నిషి జ‌న‌సేన‌లోనే ఉంటున్నా మ‌న‌స్సు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. జ‌గ‌న్‌ను కీర్తిస్తున్నారు. జ‌గ‌న్ తీసుకునే ప్ర‌తీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌డ‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌నిగా పెట్టుకుంటే రాపాక మాత్రం జ‌గన్ ప్ర‌తీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.

ఈ మ‌ధ్య ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైన నేరుగానే విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. ప‌వ‌న్ రాజ‌కీయ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్ లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త‌న‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న స‌న్నిహితంగా ఉంటున్నారు. నిన్న ఆయ‌న మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, ఎంపీ వంగా గీత‌ను క‌లిశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఫోటోలు వైసీపీ ఫ్లెక్సీల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఇంత జ‌రుగుతున్నా ఆయ‌న‌ను మాత్రం పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే ధైర్యం చేయ‌డం లేద‌ని జ‌న‌సేన పార్టీ. ద‌ళిత ఎమ్మెల్యేను స‌స్పెండ్ చేశార‌నే అప‌వాదు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, ఆయ‌న ప్ర‌త్యేక స‌భ్యుడిగా ఉండేందుకు, వైసీపీకి ఇంకా ద‌గ్గ‌ర‌య్యేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుంద‌ని జ‌న‌సేన భావిస్తోంది.

దీంతో పార్టీ నుంచి స‌స్పెండ్ అవుతామ‌నే వారి ఆశ‌లు నెర‌వేర‌డం లేదు. కాగా, నిన్న కొంద‌రు రాజోలులో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరారు. ఈ చేరిక‌ల వెనుక కూడా ఎమ్మెల్యే రాపాక ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle