newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ఆస్తులకోసమే జగన్‌కు చిరు జైకొట్టాడా?

22-12-201922-12-2019 13:57:57 IST
2019-12-22T08:27:57.680Z22-12-2019 2019-12-22T08:27:39.940Z - - 19-01-2020

ఆస్తులకోసమే జగన్‌కు చిరు జైకొట్టాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది. పార్టీల నేతల మధ్య సీఎం జగన్‌ ప్రకటన విబేధాలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటన ఏపీలో సంచనలంగా మారింది. చిరంజీవి తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఓ వైపు వైసీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. చిరంజీవి మాత్రం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం అద్భుతమంటూ ప్రకటించారు. దీంతో జనసైనికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు రాజధానుల అంశంపై ఓవైపు ఏపీలో ప్రజలు రెండుగా చీలిపోయారు. ఈ విధానం సరైందే అని కొందరు అంటుంటే.. ఒక్క రాజధానితోనే మేలు జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాల వాసులు రాజధానిని తరలించవద్దంటూ గత నాలుగైదు రోజులుగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ నిర్ణయానికి మద్దతుగా చిరంజీవి చేసిన ప్రకటన అమరావతి ప్రాంత ప్రజలతో పాటు, జనసైనికుల్లోనూ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

చిరంజీవి జగన్‌కు జైకొట్టడం వెనుక మరోకారణం ఉందని జనసైనికులు పేర్కొంటున్నారు. ఆయన స్వలాభంకోసం, తన ఆస్తులను పెంచుకోవటం కోసమే చిరు ఈ విధంగా ప్రకటన చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి వైజాగ్‌ ప్రాంతంలో ఆస్తులు ఉన్నాయి. చిరుతో పాటు తన బావ అల్లు అరవింద్‌, ఆయన కుటుంబ సభ్యులకు వందల ఎకరాల్లో భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మాణం చేసేందుకు గతంలో ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగుతుంది. కాగా ప్రస్తుతం వైజాగ్‌కు రాజధానిని తరలిస్తే.. అది మరింత మేలు చేస్తుందని చిరంజీవి భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

చిరంజీవికి జగన్మోహన్‌రెడ్డి అంటే కొంత వ్యతిరేఖ భావాలు ఉండేవి. 2014లో గంటా శ్రీనివాస్‌రావు వైకాపాలోకి వెళ్దామని భావించినా.. టీడీపీలో చేరితేనే మంచిదని సూచనలు చేసినట్లు గంటానే ఓ సారి పేర్కొన్నారు. కానీ ఇటీవల ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించి అధికారంలోకి రావడంతో జగన్‌కు చిరు ఆప్తమిత్రుడుగా మారిపోయారు. అప్పటి నుండి జగన్‌ నిర్ణయాలను సమర్థిస్తూ వస్తున్నారు.

ఓవైపు చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సీఎం జగన్‌ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. అంతేకాక జగన్‌ను తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు. అదేరీతిలో జగన్‌సైతం పవన్‌పై దూషణలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిరు జగన్‌ నిర్ణయాలకు మద్దతు తెలుపుతుండటం జనసైనికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

చిరంజీవి కేవలం డబ్బు మనిషి అని, ఆయనకు సిద్దాంతాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం వైజాగ్‌లో తన ఆస్తులను మరింత పెంచుకొనేందుకు, స్టూడియోలు నిర్మించుకొనేందుకు జగన్‌వైపుకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు.

చిరంజీవికి ప్రజల బాగోగులు పట్టవని, కేవలం తను, తన బావ అల్లు అరవింద్‌ ఆస్తులను రెట్టింపు చేసుకోవటానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు చిరు అభిమానులుసైతం ఆరోపిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి చిరంజీవి ఎలాంటి లబ్ధిపొందపోతున్నాడు..? నిజంగా వైజాగ్‌లోని తన ఆస్తులను పెంచుకొనేందుకే జగన్‌కు జైకొట్టాడా...? లేక ఏమైనా వ్యూహం ఉందా అనేది ఏపీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle