newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఆళ్లగ‌డ్డ రాజ‌కీయాల్లో భారీ కుదుపు...!

15-10-201915-10-2019 12:19:48 IST
2019-10-15T06:49:48.752Z15-10-2019 2019-10-15T06:49:29.881Z - - 15-12-2019

ఆళ్లగ‌డ్డ రాజ‌కీయాల్లో భారీ కుదుపు...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. మాజీ మంత్రి అఖిల‌ప్రియ కుటుంబం ఇబ్బందుల‌కు కార‌ణం ఎవ‌రు..? ఆమె భర్త ఎందుక‌ని త‌రచూ వివాదాలకు కేంద్రబిందువ‌వుతున్నారు..? ఇంత‌కీ ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేస్తారా..? లేక ముంద‌స్తు బెయిల్ తెచ్చుకుంటారా..? అన్న ప్ర‌శ్న‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో చ‌ర్చనీయాంశంగా మారాయి.

కాగా, ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ అనంత‌రం భూమా కుటుంబంలో ఎవ‌రకు వారే య‌మునాతీరే అన్న మాదిరి గ్రూపులుగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. వారిలో కొంద‌రు పార్టీలు మార‌గా, మ‌రికొంద‌రు భూమా కుటుంబానికి దూర‌మ‌య్యారు. అయితే ఈ ప‌రిణామాల‌న్నింటికి మూల‌కార‌ణం అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ నాయుడేన‌ని వారు చెప్పుకొస్తున్న వాద‌న‌. ఆ క్ర‌మంలోనే భార్గ‌వ్‌రామ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. చివ‌ర‌కు భూమా ద‌గ్గ‌రి బంధువులు విసిగిపోయి ఆయ‌న‌పై ఫిర్యాదు కూడా చేశారు. దీన్నిబ‌ట్టే చెప్పొచ్చు ఆళ్ల‌గ‌డ్డ‌లో ప‌రిస్థితి ఎంత వ‌ర‌కు దారి తీసిందో అన్న విష‌యం.  

అయితే, అఖిల‌ప్రియ‌ను పెళ్లిచేసుకోక ముందే ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో భార్గ‌వ్‌రామ్ త‌ర‌చూ జోక్యం చేసుకున్నార‌ని అప్ప‌ట్లో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఒక వ‌ర్గ‌మంతా భూమా కుటుంబానికి దూర‌మైంద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. పెళ్లి చేసుకున్న త‌రువాత భార్గ‌వ్‌రామ్ నాయుడు రాజ‌కీయ జోక్యం మ‌రింత పెరిగింద‌ని భూమా కుటుంబానికి దూర‌మైన అనుచ‌రులు చెప్పుకొస్తున్నారు.

భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌లి కాలంలో ఎవ్వ‌రూ కూడా నేరుగా ప్ర‌త్య‌క్ష త‌గాదాల‌కు దిగిన సంద‌ర్భాలు లేవు. కానీ, పోలింగ్ రోజు అహోబిళంలో జరిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి భార్గ‌వ్ ప్ర‌త్య‌క్షంగా ఉన్న‌ట్టు వీడియోల‌తో స‌హా స్ప‌ష్ట‌మైంది. అదే స‌మ‌యంలో భూమా ప్ర‌త్య‌ర్ధులు కూడా ఉండ‌టంతో భూమా, గంగుల కుటుంబాల‌కు చెందిన నేత‌ల‌పై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోద‌య్యాయి. అందులో భార్గ‌వ్ కూడా ఉన్నారు.

ఆ త‌రువాత భార్గ‌వ్ జోక్యం త‌ట్టుకోలేని భూమా నాగిరెడ్డి బంధువులు కొంద‌రు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. భూమా నాగిరెడ్డి ద‌గ్గ‌రి బంధువు శివ‌రామిరెడ్డికి క్ర‌ష‌ర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇద్ద‌రి మ‌ధ్య వివాదం ఉన్న విష‌యం ఎవ్వ‌రికీ తెలీదు. కానీ, భార్గ‌వ్ జోక్యంతో వివాదం కాస్త పోలీసు స్టేష‌న్‌లో కేసు పెట్టుకునేంత వ‌ర‌కు వెళ్లింది. క్ర‌ష‌ర్ ఫ్యాక్ట‌రీ మొత్తం త‌న‌దేనంటూ భార్గ‌వ్ బెదిరించాడ‌ని, ఫ్యాక్ట‌రీ ఆఫీసును ధ్వంసం చేశాడ‌ని శివరామిరెడ్డి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో భార్గ‌వ్‌పై కేసు కూడా న‌మోదైంది. అప్ప‌ట్నుంచి భార్గ‌వ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  హైద‌రాబాద్‌లో ఉన్నాడ‌ని తెలుసుకున్న ఆళ్ల‌గ‌డ్డ పోలీపులు అత‌న్ని ప‌ట్టుకునేందుకు బ‌య‌ల్దేర‌గా త‌ప్పించుకుని పారిపోయాడు. పారిపోయే స‌మ‌యంలో త‌మ‌పైకి కారు దూసుకుపోయేలా వ్య‌వ‌హ‌రించి విధుల‌కు ఆటంక‌ప‌రిచార‌ని పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఎన్నిక‌ల కేసు నుంచి భార్గ‌వ్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీంతో ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టు కాకుండా ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దీనిపై అఖిల‌ప్రియ బ‌హిరంగంగా స్పందించ‌న‌ప్ప‌టికీ త‌న భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌ను వెన‌కేసుకొస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇదంతా కావాల‌నే ఓ ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని, అంతా కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని ఆమె అంటున్న‌ట్టు స‌మాచారం. భూమా కుటుంబంలో భార్గ‌వ్ కార‌ణంగా ఎవ్వ‌రికీ ఎలాంటి ఇబ్బంది లేద‌ని, అన్నీ కూడా క‌ల్పితాలేన‌ని భూమా అఖిల‌ప్రియ చెప్పుకొస్తుండ‌టం విశేషం. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle