newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఆర్థిక సంక్షోభం ముంగిట ఏపీ- నీతి ఆయోగ్ ఆందోళన

16-09-201916-09-2019 08:21:03 IST
Updated On 16-09-2019 12:50:01 ISTUpdated On 16-09-20192019-09-16T02:51:03.135Z16-09-2019 2019-09-16T02:50:24.937Z - 2019-09-16T07:20:01.344Z - 16-09-2019

ఆర్థిక సంక్షోభం ముంగిట ఏపీ- నీతి ఆయోగ్ ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర మనుగడ, పురోగమనానికి ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం దోహదం చేసేదిగా లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.

ప్రభుత్వ పనితీరు భేష్ అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీలో ప్రశంసల వర్షం కురిపించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ దాని కంటే ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రస్తావించారని తెలుస్తున్నది. 

పెట్టుబడులుపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఆర్థిక లోటు ఆందోళనకరస్థాయిని కూడా దాటిపోయిందన్న అభిప్రాయాన్ని నీతి ఆయోగ్ వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపు సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం ఎలా భావిస్తున్నదో అవగతం కావడం లేదన్న భావన నీతి ఆయోగ్ వ్యక్తం చేసింది.

వివిధ శాఖల మంత్రులు అధికారులతో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి దిద్దుబాటు చర్యలను సూచించినట్లుగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారులు చెప్పారు. 

బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా లేవనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరేచేందుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించింది. పారిశ్రామిక పురోగతి, పెట్టుబడుల ఆకర్షణ తక్షణ అవసరమని అభిప్రాయపడింది. రాష్ట్రానికి తగినంత సహకారం, సహాయం అందిస్తామని చెబుతూనే ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను నీతి ఆయోగ్ నొక్కి చెప్పింది. సంక్షేమం, అభివృద్ధి కుంటుపడకుండా తీసుకోవలసిన చర్యలనూ సూచించింది. 

అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభానికి మూలం రాష్ట్ర విభజనలో ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కచ్చితంగా ఒక ప్రాంతానికి అన్యాయం, మరో ప్రాంతానికి ప్రయోజనం చేకూరేలా జరిగింది.

ఈ విషయాన్ని రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, ఆ విభజనకు సహకరించిన నాటి విపక్షం కూడా పార్లమెంటు సాక్షిగా అంగీకరించాయి. ఆ నష్టం పూడ్చేందుకు కొన్ని విస్పష్ట హామీలూ ఇచ్చాయి. వాటిలో రెవెన్యూ లోటు పూడ్చడం అన్నది ప్రధానమైది. కేంద్రీయ విద్యాలయాలు, పరిశ్రమలు వంటివి కూడా ఉన్నా...ప్రధానంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు రెవెన్యూ లోటు పూడుస్తామన్న హామీపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. 

అయితే విభజన జరిగి ఐదేళ్లు దాటిపోయినా రెవెన్యూ లోటు ఎంత అన్నదానిపై కేంద్రం, రాష్ట్రాల లెక్కలు ఇప్పటికీ తీరలేదు. లోటు పూడకుండా ఆర్థిక ప్రగతి సాధ్యం కాదన్న సంగతి నీతి ఆయోగ్ కు తెలియక కాదు.

అయినా ఆ విషయం పక్కన పెట్టి సూచనలూ సలహాలూ ఉచితంగా ఇవ్వడమన్నది ఈ ఐదేళ్ల కాలంలో జరుగుతూనే ఉంది. విధానాలు ప్రశంసించడం, ఆ విధానాలు సజావుగా సాగాలంటే అవసరమైన ఆర్థిక సంపత్తి అవసరమన్న విషయాన్ని గుర్తించీ గుర్తించనట్టు నీతి ఆయోగ్ వ్యవహారం ఉంది. విభజన జరిగి ఐదేళ్లయ్యింది.

ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం సర్కార్ ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రంతో పోరాడుతూనే గడిపింది.  ఇప్పుడు ఏపీలో వైకాపా సర్కార్ కొలువుదీరింది. వంద రోజుల పాలన పూర్తయిన తరువాత నీతి ఆయోగ్ మళ్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.

హామీలు నీటిమూటలుగా మిగిలిన పరిస్థితిలో రాష్ట్రం  ఆర్థికంగా ఎలా పుంజుకుంటుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు విభజన హామీలు తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతను నీతి ఆయోగ్ కేంద్రానికి నివేదించాలి. అప్పుడే ఏపీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది.  

 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   5 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle