newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆర్టీసీ విషయంలో 'తెలంగాణ, ఏపీ' దొందూదొందేనా?

03-11-201903-11-2019 07:33:23 IST
2019-11-03T02:03:23.081Z03-11-2019 2019-11-03T02:02:42.215Z - - 13-08-2020

ఆర్టీసీ విషయంలో 'తెలంగాణ, ఏపీ' దొందూదొందేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రభుత్వాలు దొందూ దొందేనా? అంటే అవుననే అనిపిస్తుంది. అదేంటి తెలంగాణలో ఆర్టీసీ వాళ్ళు అడిగింది కాదంటే కాదు పొమ్మని కెసిఆర్ అంటుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎంచక్కా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తున్నాడు కదా.. రెండూ ఒక్కటెలా అవుతాయని అంటారా? కాసేపు విలీనం సంగతి పక్కన పెడితే రెండు ప్రభుత్వాలు ఆర్టీసీ బకాయిల చెల్లింపు విషయంలో ఒక్కటే మాట మీద ఉన్నాయి.

తెలంగాణలో దాదాపు ఆర్టీసీ సమ్మె మొదలై నెలరోజులు అవుతుండగా వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన మూడువేల ఏడువందల కోట్లపైన బకాయిలను చెల్లిస్తే ఆర్టీసీ సంక్షోభం నుండి బయటపడుతుంది కదా అని సాక్షాత్తు కోర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తామసలు బకాయిలే చెల్లించాల్సిన అవసరమే లేదని వాదిస్తుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరే ప్రవర్తిస్తుందని ఆ రంగానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల వాదన.

ఇక ఏపీ విషయానికి వస్తే ఆర్టీసీకి ప్రభుత్వం మూడువేల కోట్లకు పైనే బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2013కు సంబంధించి వేతన సవరణలో బకాయి మొత్తంలో 40 శాతాన్ని ఉగాది నాటికే చెల్లిస్తామని ఇంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌ 30 నాటికి 40 శాతం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని విలీనం అనే మాట మాయలో ఏ మార్చేసింది.

ఇక ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ముంచేసింది అని చెప్పకతప్పదు. కార్మికుల వేతనాల్లో కొంత కోత విధించి యాజమాన్యం ఖర్చులకు వాడేసుకుంది. కోత విధించిన ఆ ఎనిమిది వందల కోట్లకు పైగా మొత్తాన్ని పిఎఫ్‌ ట్రస్ట్‌కు జమ చేయాల్సి ఉన్నా ఏడాది పైగా చెల్లించనేలేదు. ఇక ఎస్‌ఆర్‌బిఎస్‌, ఎస్‌బిటి ట్రస్ట్‌, సిసిఎస్‌ తదితర అంశాలతో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన వాటిలో కూడా యాజమాన్యం బకాయిలు పేరుకుపోయాయి.

ఇక త్వరలోనే రాష్ట్రానికి రానున్న ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయి. విద్యుత్ బస్సుల వ్యవహారాన్ని రెండు ప్రభుత్వాలు ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు అప్పగించాయి. ఆ బస్సుల కొనుగోళ్లలో కేంద్రం బస్సుకు కోటి చొప్పున ఇచ్చే రాయతీలు కూడా ఆ ప్రైవేట్ సంస్థలకే దక్కాయి. త్వరలోనే రెండు ప్రభుత్వాలు విద్యుత్ బస్సుల కొనుగోళ్లలో భారీ ఒప్పందాలు కూడా ప్రైవేట్ సంస్థలతోనే చేసుకున్నాయి.

ఇక సంస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ చేసే అంశంలో కూడా రెండు ప్రభుత్వాలు ఒకేలా ఉన్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మూడువేల మంది పదవి విరమణ చేసినా ఆ ఖాళీలు అలానే ఉండగా ఏపీలో నాలుగేళ్ళలో దాదాపు ఆరువేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేసినా ఆ ఖాళీలు కూడా అలానే దర్శనమిస్తున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ రేపు ప్రభుత్వంలో విలీనం జరిగినా.. జరగకపోయినా ప్రభుత్వ ట్రెజరీ నుండి రావాల్సిన ఈ బకాయిలను చెల్లించక తప్పదు. మరి ఈ బకాయిలు ఏపీ ప్రభుత్వం అయినా ఆర్టీసీకి చెల్లిస్తుందా? తెలంగాణ మాదిరి వాదిస్తుందా?!

 

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   9 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   14 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle