newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు

16-12-201916-12-2019 09:43:07 IST
2019-12-16T04:13:07.574Z16-12-2019 2019-12-16T04:12:54.721Z - - 20-01-2020

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది వైసీపీ సర్కార్. ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సహా అక్రమంగా మద్యం అమ్మకం, రవాణాపై కఠిన చర్యలు తీసుకునే బిల్లులు ఇందులో ఉన్నాయి. ఏపీలో విద్యార్ధులకు ప్రయోజనం కల్పించేలా  జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. 

మొత్తం 11 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ  కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సోమవారం సభలో చర్చించి ఆమోదిస్తారు. 

ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉద్యోగులు ఎప్పటినుంచో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి, ఆర్టీసీ ఉద్యోగులందరినీఈ శాఖ కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. దీని ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులు కూడా తెరమీదకు తెచ్చి సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె మధ్యలోనే తమ డిమాండ్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు ఏపీలో ఆర్టీసీని విలీనం చేస్తే తెలంగాణలోనూ ప్రభుత్వంపై వత్తిడి పెరగనుంది.

దీనికి తోడు రైతులు పండించే వివిధ పంటలకు మెరుగైన ధరలు కల్పించడం కోసం కాఫీ, టీ బోర్డుల తరహాలోనే చిరు, పప్పు ధాన్యాల బోర్డులను విడివిడిగా ఏర్పాటు చేస్తారు. బిల్లు ద్వారా ఈ బోర్డులకు స్వతంత్ర ప్రతిపత్తి లభించనుంది.

ఆయా పంటల ప్రణాళిక నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు ఈ బోర్డులు స్వతంత్రంగా పనిచేయనున్నాయి. అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిశోధన, స్టోరేజీ, ప్రాసెసింగ్ వంటివి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మద్యం అక్రమంగా అమ్మడం, రవాణా చేయడంపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి నేరాలు చేసినవారికి 6 నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మొదటిసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు.

బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్‌ రద్దు చేసేలా ఎక్సైజ్‌ చట్టంలో సవరణలకు బిల్లు సభ ముందుకి రానుంది. ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle