newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

‘‘ఆర్కె, శ్రీదేవి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’

31-12-201931-12-2019 07:53:50 IST
Updated On 31-12-2019 09:43:53 ISTUpdated On 31-12-20192019-12-31T02:23:50.819Z31-12-2019 2019-12-31T02:19:07.945Z - 2019-12-31T04:13:53.587Z - 31-12-2019

‘‘ఆర్కె, శ్రీదేవి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిని రాజధానిగానే కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రాజధాని గ్రామాల్లో ఆందోళన నిర్వహిస్తున్న మహిళలతో టీడీపీ అధికార ప్రతినిథి పంచుమర్తి అనురాధ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తమ భవిష్యత్తు గురించి ఆవేదనతో ధర్నాలు చేస్తున్న రైతులు వైసీపీ నేతలకు పెయిడ్ ఆర్టిస్టుల్లా కనబడుతున్నారా అంటూ ఆమె ధ్వజమెత్తారు.వైసీపీ ఎమ్మెల్యేలంతా పెయిడ్ ఆర్టిస్టులేనని రైతులు అంటున్నారని ఆమె అన్నారు. 

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ధైర్యముంటే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలంటూ ఆమె సవాల్ విసిరారు. 15 రోజులుగా రైతులు రోడ్లమీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే సానుకూలంగా స్పందించాల్సిందిపోయి పెయిడ్ ఆర్టిస్టులంటూ అన్నదాతల్ని అవమానిస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం అని ప్రసంగాలిచ్చే వైసీసీ నేతలకు  రైతులంటే గౌరవం, మర్యాద లేవని మండిపడ్డారు. 

మంత్రి స్థాయిలో బొత్స సత్యనారాయణ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే ఆర్కే 2014 నుంచి 2019  వరకు ప్రజలని పట్టించుకోకుండా అమరావతిని అడ్డుకుంటూ 365 రోజులు 365 కేసులు వేసారని, రాజధాని రాకుండా ఎమ్మెల్యే ఆర్కే ఎన్ని కేసులు వేసారో ప్రజలందరికీ తెలుసన్నారు. 

Image result for Mla Rk and Sridevi"

రాజధాని ప్రాంతలో శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండికూడా రైతుల గురించి మాట్లాడకపోవడం దారుణం అన్నారు అనూరాధ. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు ఆర్కే, శ్రీదేవి సీఎం జగన్ తో పోరాడాలి లేదా రాజీనామా చేయాలన్నారు.

మరోవైపు మంత్రి బొత్స టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. 

విశాఖను అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle