newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో చంద్రబాబు ర‌హ‌స్య భేటీ..!

01-11-201901-11-2019 11:53:32 IST
Updated On 01-11-2019 17:15:37 ISTUpdated On 01-11-20192019-11-01T06:23:32.944Z01-11-2019 2019-11-01T06:23:28.417Z - 2019-11-01T11:45:37.279Z - 01-11-2019

ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో చంద్రబాబు ర‌హ‌స్య భేటీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రో భారీ యూట‌ర్న్‌ తీసుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారా..? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కాగా, గ‌త ఏడాది జ‌రిగిన‌ కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల త‌రువాత టీడీపీ బీజేపీతో సంబంధాల‌ను తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత జ‌రిగిన తెలంగాణ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు నేరుగా కాంగ్రెస్ పార్టీతో డైరెక్టుగానే పొత్తు పెట్టుకున్నారు.

టీడీపీతో బ‌హిరంగ పొత్తు కార‌ణంగా ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. ఆ త‌రువాత జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేరుగా టీడీపీతోనైతే పొత్తు పెట్టుకోలేదు కానీ.. బ‌హిరంగంగానే స్నేహాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చారు.

చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీకి వ్య‌తిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ శ‌క్తుల‌ను, పార్టీల‌ను ఏకంగా చేస్తానంటూ దేశ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌ల‌ను కొన‌సాగించారు. ఏపీలో ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ పార్టీ త‌రుపున తానే స్వ‌తంత్రంగా చొర‌వ తీసుకుని దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నాయ‌కుల‌ను క‌లిసి మోడీకి వ్య‌తిరేకంగా పోరాటం చేద్దాం అంటూ అంద‌ర్నీ క‌లిశారు.

ఒకానొక ద‌శ‌లో చంద్ర‌బాబు నాయుడునే ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌బోతున్నారు..  అంటూ టీడీపీ అనుకూల ప‌త్రిక‌లు కూడా స్థానికంగా క‌థ‌నాలు రాశాయి. అయితే, తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత బీజేపీకి భారీగా సీట్లు రావ‌డం మోడీ తిరిగి ప్ర‌ధాని అవ‌డంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. కొన్ని నెల‌ల‌పాటు మోడీ పేరు ఎత్తేందుకు కూడా చంద్ర‌బాబు సాహ‌సించ‌లేదు.

అయితే, ఇటీవ‌ల కొద్ది రోజులుగా బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు వివిధ మార్గాల్లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితులు, బినామీలుగా చెప్పుకునే సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌ల‌ను బీజేపీలోకి పంపించారు. ఆ త‌రువాత కూడా వివిధ మార్గాల్లో బీజేపీ నేత‌ల‌ను దువ్వేందుకు చంద్ర‌బాబు నాయుడు య‌త్నిస్తూనే ఉన్నారు.

ఇటీవ‌ల ఓ స‌మావేశంలో త‌న‌కు మోడీతో ఎలాంటి విబేధాలు, వ్య‌క్తిగ‌త విబేధాలు లేవు అని కూడా చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇలా వివిధ మార్గాల్లో ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబుకు బీజేపీ నేత‌లు మాత్రం అస‌లు చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకునే అవ‌కాశ‌మే లేదు. త‌లుపులు మూసేశాం. చంద్ర‌బాబుతో క‌లిసే ప్ర‌స‌క్తే లేదు అని చెబుతున్న‌ప్ప‌టికీ కూడా చంద్ర‌బాబు త‌న ప్ర‌య‌త్నాల‌ను చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు నేరుగా మ‌రో అడుగు ముందుకేశారు చంద్ర‌బాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తో ప్ర‌త్యేకంగా, ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు నాయుడు భేటీ అయ్యారు. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాల‌యంలో దాదాపు రెండు గంట‌ల‌పాటు చంద్ర‌బాబు నాయుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివ‌రాల‌ను రిల‌య‌న్స్ గ్రూప్‌కు సంబంధించిన ఓ వార్తా సంస్థ ప్ర‌చురించడం విశేషం.

మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య భేటీకి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించారు, రాయ‌బారిగా ప‌నిచేశార‌ని కూడా ఈ మీడియా సంస్థ చెబుతోంది. తొలి నుంచి కూడా గ‌డ్క‌రీతో చంద్ర‌బాబు నాయుడుకు మంచి సంబంధాలే ఉన్నాయి. పార్టీల‌కు అతీతంగా వీరి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయి. ఒకానొక ద‌శ‌లో మోడీని కాకుండా గ‌డ్క‌రీని ప్ర‌ధానిగా అభ్య‌ర్ధిగా ప్ర‌కటిస్తే బీజేపీతో తాము క‌లిసి ప‌నిచేసేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా చంద్ర‌బాబు ఆఫ‌ర్ ఇచ్చారు. అలా ఆ స్థాయిలో చంద్ర‌బాబు, గ‌డ్క‌రీల మ‌ధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.

ఈ సంబంధాల‌ను ఆధారంగా చేసుకుని గ‌డ్క‌రీ ద్వారా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తో చంద్ర‌బాబు నాయుడు భేటీ అయిన‌ట్టు చెబుతున్నారు. ప‌రిణామాల‌ను చూస్తుంటే ఎలాగైనా స‌రే బీజేపీకి ద‌గ్గరై తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ట్టుగా ఉంది. అయితే ఈ సారి ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు చంద్ర‌బాబుతో పొత్తుపెట్టుకుని మోస‌పోతూ వ‌స్తున్న బీజేపీ ఈ సారి మాత్రం చంద్ర‌బాబు నాయుడును అంత ఈజీగా న‌మ్ముతుందా అన్న‌ది ప్ర‌శ్న‌.

చంద్ర‌బాబు త‌న అవ‌స‌రాల కోస‌మే త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌న్న నిర్ధార‌ణ‌కు బీజేపీ నేతలు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ సారి ఒక‌వేళ చంద్ర‌బాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నా.. స్నేహం చేసినా అందుకు భారీగా డిమాండ్‌లు ముంద‌స్తు కండీష‌న్లు పెట్ట‌డ‌మైతే ఖాయంగా క‌నిపిస్తుంద‌ని అభిజ్ఞాన‌వ‌ర్గాల భోగ‌ట్టా.

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle