newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

ఆరోప‌ణ‌లు స‌రే.. ఆధారాలేవి..?

03-01-202003-01-2020 09:08:55 IST
Updated On 03-01-2020 11:09:47 ISTUpdated On 03-01-20202020-01-03T03:38:55.331Z03-01-2020 2020-01-03T03:38:44.852Z - 2020-01-03T05:39:47.885Z - 03-01-2020

ఆరోప‌ణ‌లు స‌రే.. ఆధారాలేవి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమ‌రావ‌తి ఓ పెద్ద ల్యాండ్ స్కామ్‌. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేత‌లు వేల కోట్ల విలువైన భూములు కొల్ల‌గొట్టారు. ఇదీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌దేప‌దే చేస్తున్న ఆరోప‌ణ‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నుంచి ఆ పార్టీ సామాన్య కార్య‌క‌ర్త వ‌ర‌కు అమ‌రావ‌తి పేరు చెబితే చాలు టీడీపీ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిపింద‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తే ఓకే కానీ అధికారంలోకి వ‌చ్చాక కూడా కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తుందో ముందే నిర్ధారించుకున్న తెలుగుదేశం పార్టీ నేత‌లు ఈ ప్రాంతంలో త‌మ బినామీలు, బినామీ సంస్థ‌ల పేర్లపైన త‌క్కువ రేట్ల‌కు రైతుల వ‌ద్ద నుంచి భూములు కొనుగోలు చేశార‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. వాస్త‌వానికి వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా సాక్షి ప‌త్రిక ఓ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని రాజ‌ధాని ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై ప్ర‌చురితం చేసింది. టీడీపీ నేత‌లు, అప్ప‌టి మంత్రులు ఎవ‌రెవ‌రు ఎన్నెన్ని ఎక‌రాల భూములు కొన్నారో సాక్షి ఆ క‌థ‌నంలో వివ‌రించింది.

ఈ క‌థ‌నం ఆధారంగానే రాజ‌ధాని ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై వైసీపీ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను నిరూపించే ప్ర‌య‌త్నం మాత్రం వైసీపీ చేయ‌లేదు. టీడీపీ కూడా నిరూపించ‌మ‌ని ఎటువంటి స‌వాళ్లు చేయ‌లేదు. రాజ‌ధాని ప్రాంతంలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు గెలిచారంటే వైసీపీ చేసిన ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు ఎంతోకొంత న‌మ్మార‌నే అర్థం.

తాము అధికారంలోకి వ‌స్తే ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ బాగోతంపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు స్ప‌ష్టంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వైసీపీ ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం అవుతుంది. అమ‌రావ‌తి నుంచి పాల‌నా రాజ‌ధానిని, హైకోర్టును త‌ర‌లించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ప్ర‌భుత్వం.. ఇక్క‌డ జ‌రిగిన ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌ను కూడా ఓ కార‌ణంగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై ప్ర‌భుత్వం మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డిపై వేసిన కేబినెట్ స‌బ్‌ క‌మిటీ నివేదిక కూడా ఇచ్చింది.

అసెంబ్లీలో బ‌య‌ట కూడా టీడీపీకి చెందిన ఫ‌లానా వారు భూములు కొన్నార‌ని బుగ్గ‌న ఆరోప‌ణ‌లు చేశారు. నివేదిక‌లో కూడా 4,070 ఎక‌రాల భూముల‌ను టీడీపీ నేత‌లు కొనుగోలు చేశార‌ని తేల్చారు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ, ఇందుకు సంబంధించి ఇంతవ‌ర‌కు ఎటువంటి ముంద‌డుగు ప‌డ‌లేదు. దీంతో వైసీపీవి ఇంకా ఆరోప‌ణ‌లుగానే మిగిలిపోయాయి.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వైసీపీ నేత‌లు 21 నిమిషాల నిడివి గ‌ల వీడియో రూపంలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు చేశారు. టీడీపీ నేత‌లు ఎవ‌రెవ‌రు భూములు కొన్నారో, ఏయే బినామీల పేర్ల‌పై కొన్నారో వివ‌రించారు.

ఇక్క‌డ కేవ‌లం పేర్లు, ఎక‌రాల సంఖ్య చెప్పి ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కానీ నిరూపించే ప్ర‌య‌త్నం వైసీపీ చేయ‌లేదు. దీంతో టీడీపీ నేత‌లు ద‌మ్ముంటే నిరూపించ‌మ‌ని ప్ర‌తిస‌వాళ్లు విసురుతున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత దూళిపాళ్ల న‌రేంద్ర అయితే వెంట్రుక కూడా పీక‌లేర‌ని టీవీ ఛాన‌ల్‌లోనే వైసీపీకి స‌వాల్ విసిరారు.

800 వంద‌ల మంది తెల్ల రేష‌న్ కార్డు దారులు భూములు కొన్నార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. వారు టీడీపీ నేత‌ల బినామీలు అంటోంది. అయితే, బినామీల‌ను చ‌ట్టం ముందు నిరూపించాలంటే బ‌ల‌మైన సాక్ష్యాలు అవ‌స‌రం. క‌నీసం ఆధారాలనైనా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే టీడీపీని ఇరుకున పెట్ట‌వ‌చ్చు.

కానీ, వైసీపీ మాత్రం మాట‌ల రూపంలోనో, వీడియో రూపంలోనో ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం అవుతోంది కానీ నిరూపించ‌డం లేదు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌ల‌ను ఎక్కువ కాలం ఎవ‌రూ విశ్వ‌సించరు. పైగా ద‌మ్ముంటే నిరూపించ‌మ‌ని టీడీపీ చేస్తున్న స‌వాళ్లు చూస్తుంటే వారి త‌ప్పేమీ లేదేమో అనే భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగే అవ‌కాశం ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle