newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

ఆరోపణలు వైసీపీ జన్మహక్కా? లోకేష్ సవాలుకు సమాధానమేది?

11-11-201911-11-2019 13:01:42 IST
2019-11-11T07:31:42.531Z11-11-2019 2019-11-11T07:31:40.108Z - - 03-07-2020

ఆరోపణలు వైసీపీ జన్మహక్కా? లోకేష్ సవాలుకు సమాధానమేది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలపైన ఆరోపణలు చేయడం సహజమే. ప్రస్తుత రాజకీయాలలో ఈ ఆరోపణలలో నిజానిజాలు ఎంతవరకు అని అడిగినా సమాధానం దొరకడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు మాత్రమే ఇలాంటి ఆరోపణలు ప్రయోగించి ప్రజలలో వ్యతిరేకత పెంచడం కోసమే ప్రతిపక్షాల పని. ఈ వ్యవహారంలో వైసీపీ సూపర్ సక్సెస్ అయింది.

గత టీడీపీ ప్రభుత్వంపైన వైసీపీ చేయని ఆరోపణ లేదు. ప్రభుత్వం చేసిన ప్రతిపనిలో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ దివాళా తీసి ఖాతాదారులకు భారీ పంగనామం పెట్టిన అగ్రిగోల్డ్ లాంటి సంస్థల వ్యవహారాలను కూడా టీడీపీ ప్రభుత్వానికే అంటగట్టారు. ఒకపక్క అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టులో ఉండగానే ఆస్తులను దోచేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంస్థ ఆస్తులను మంత్రి లోకేష్ కు దోచిపెట్టేందుకే సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని బలంగా ప్రజలోకి తీసుకెళ్లారు. అయితే అదంతా గత ప్రభుత్వంలో వ్యవహారం కాగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆరోపించిన వైసీపీ. సర్వ అధికారాలు తమ చేతుల్లోనే ఉన్నా వైసీపీ అప్పుడు చేసిన ఆరోపణలే చేయడం విడ్డురంగా ఉంది.

ఈమధ్యనే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు పదివేల చొప్పున పరిహారం అందించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించగా అన్ని జిల్లాలలో మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందరూ చేసిన కామన్ ఆరోపణ. మాజీ మంత్రి లోకేష్ అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే చంద్రబాబు గుడ్డలూడదీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విమర్శలపై స్పందించిన నారా లోకేష్ మంత్రులతో సహా స్పీకర్ తమ్మినేనికి ఓ సవాల్ విసిరారు. ఐదు నెలలుగా తమపై ఎన్ని విచారణలు చేసినా ఒక్కటీ నిరూపించలేకపోయారని.. ఇప్పటికీ మించిపోయింది లేదు కనుక ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని.. లేకపోతే మీ ముఖ్యమంత్రి బట్టలు ఊడదీస్తారా అంటూ సవాల్ విసిరారు.

లోకేష్ సవాల్ మంత్రులకు సూటిగా సుత్తిలేకుండా ఘాటుగానే తగిలింది. రోజులు గడుస్తున్నా ప్రత్యారోపణలే కానీ ఆధారాలు బయటకు రావడం లేదు. సూటిగా మంత్రులనే సమాధానం అడిగినా తడబాటే కనిపిస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలను లోకేష్ సవాలుపై మీ సమాధానం ఏమిటని అడిగితే అద్దడారిలో మంత్రి అయిన లోకేష్ సవాల్ చేయడమేమిటి అని ఎదురుదాడికి దిగుతున్నారు.

అయితే అధికారంలో ఉన్నా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి నమ్మించడం ఎంతో కాలం చెల్లదు. ప్రతిపక్షంలో మాదిరి ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవడం అధికారంలో ఉన్నప్పుడు కుదరదు. తమ చేతుల్లోనే అధికారం ఉండగా సాక్షం ఒక్కటీ బయట పెట్టకపోతే ప్రజలు హర్షించరు. ఈ విషయాన్ని ఇకనైనా అధికార పార్టీ గుర్తెరిగి ఆరోపణలకు దిగితే మంచిది.. లేకపోతే నవ్వులపాలు కాకతప్పదు.

 

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   4 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   4 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   4 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   8 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   10 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   13 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   13 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   14 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   15 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle