newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఆరోగ్యశ్రీ ఇక షురూ.. 500 పైగా ఆసుపత్రుల అసోసియేషన్ ఏర్పాటు

23-09-201923-09-2019 16:41:35 IST
Updated On 24-09-2019 11:58:32 ISTUpdated On 24-09-20192019-09-23T11:11:35.525Z23-09-2019 2019-09-23T11:11:29.185Z - 2019-09-24T06:28:32.603Z - 24-09-2019

ఆరోగ్యశ్రీ ఇక షురూ.. 500 పైగా ఆసుపత్రుల అసోసియేషన్ ఏర్పాటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత ప్రధాన నగరాల్లోని ప్రవాసాంధ్రులకు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తామని ఇటీవలే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో భాగంగా వైద్యసేవలందించేందుకోసం 500కి పైగా ఆసుపత్రుల నిర్వాహకులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డారు.

ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలందించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింతగా మెరుగుపర్చిన తరుణంలో ఇంత భారీ సంఖ్యలో ఆసుపత్రులు నెట్‌వర్క్‌గా ఏర్పడి అసోసియేషన్‌గా ఏర్పడడం విశేషం.

ఈ అసోసియేషన్ పేరు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నవ్యాంధ్రప్రదేశ్‌(అనాప్‌). మొత్తం 13 జిల్లాలనుంచి 54 మంది కార్యవర్గాన్ని ఏర్పర్చుకున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యవర్గం తొలిసమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ 14 నెలలుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా నానా ఇబ్బందులూ పడుతున్నామని చెప్పారు. 

ఆరోగ్యశ్రీ పథకంలోనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాని(ఈహెచ్‌ఎస్)కి సంబంధించిన బిల్లులను కూడా గత ప్రభుత్వం 14 నెలలుగా పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు. ఇవి రూ.130 కోట్ల వరకు ఉన్నాయన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు 60 నుంచి 90 రోజులలోపు బిల్లులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ రేట్లు సవరించాలని అసోసియేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ కామేశ్వరరావు కోరారు. 

పదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లనే ఇప్పటికీ అమలు చేస్తుండటం, వాటిని కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటున్న ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే సదాశయంతో ఏర్పరుస్తున్న పథకం కూడా నీరుగారిపోయే ప్రమాదముంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle