newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!

05-12-201905-12-2019 16:39:29 IST
Updated On 05-12-2019 16:57:01 ISTUpdated On 05-12-20192019-12-05T11:09:29.072Z05-12-2019 2019-12-05T11:09:24.237Z - 2019-12-05T11:27:01.967Z - 05-12-2019

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ఘనత మాజీ సీఎం రాజశేఖరరెడ్డిదే. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ అంబులెన్సులు, ఆరోగ్యశ్రీ అయనను పేదలకు దగ్గర చేశాయి. అప్పటివరకు కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం పేదలకు దక్కడం కలకాగా ఆరోగ్యశ్రీతో అది నిజమైంది. ఆ క్రెడిట్ అయనకు దక్కాల్సిందే. అయితే అప్పుడే ఆరోగ్యశ్రీలో ఆసుపత్రుల యాజమాన్యాలు, నేతలు కుమ్మక్కులు కూడా మొదలయ్యాయి.

నేతలు తమకి కావాల్సిన ముడుపులు దక్కించుకొని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ జాబితాను కలిపిస్తే ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యక్తిగతంగా అందించే వైద్యం మీద రెండింతలు ఎక్కువకు బిల్లులు చేసుకొని దోచుకోవడం మొదలుపెట్టారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిని కంట్రోల్ చేయాలని చూసినా కుదరలేదు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో అదే పరిపాటిగా మారిందని ప్రభుత్వంతో పాటు అందరికీ తెలిసిందే.

నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తెలిసినా ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పథకం ఉద్దేశ్యం దెబ్బతింటుందని భయం. ఇదిలా ఉండగానే ఏపీలో తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకంలో వైఎస్ పేరును చేర్చడంతో పాటు మరికొన్ని సౌకర్యాలను కల్పించారు. దాదాపు 1200 రకాల కొత్త వ్యాధులు, రూ.1000 దాటితే పథకం అమలు, రూ5 లక్షల వార్షికాదాయం ఉన్నా అర్హులని చేసింది.

దీంతో పాటు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ఆసుపత్రులలో కూడా పథకం అమలును తీసుకొచ్చింది. దీంతో మెట్రో నగరాలలో ఆధునిక వైద్యం చేయించుకోవాలనుకోవారు సంతోష పడ్డారు. అయితే సరికొత్త మార్పులతో కలిసి పథకం కింద చెల్లింపులు భారీగా ఉండనున్నాయి. ఈలోగా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఆసుపత్రుల జాబితా విడుదల చేసింది.

ఈ జాబితాలో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలోని ఆసుపత్రులను చేర్చడం సమంజసంగానే ఉంది. కానీ కర్ణాటకలోని షిమోగా, భద్రావతి వంటి ప్రాంతాలలో ఉన్న ఆస్పత్రులను చేర్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆయా ప్రాంతాలలో ఆంధ్రా ప్రజలు చాలా స్వల్పం. కానీ అక్కడ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చారు.

పేషేంట్ ఆరోగ్యశ్రీ కార్డు దొరికితే చాలు లక్షలకు లక్షలు బిల్లులు చేసుకొనే ఆసుపత్రులు కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఇవ్వడం వెనుక ఏదో మతలబు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అసలే సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైన కర్ణాటక ప్రాంతంలో ఆసుపత్రులకు మాత్రమే ఇవ్వడం, మిగతా రాష్ట్రాలలో రాజధాని నగరాలకు మాత్రమే ఇవ్వడమే ఎక్కడో తేడా కొట్టేస్తుంది!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle