newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఆరెండు జిల్లాల మధ్య రాకపోకలు బంద్

16-04-202016-04-2020 09:04:02 IST
Updated On 16-04-2020 09:16:46 ISTUpdated On 16-04-20202020-04-16T03:34:02.590Z16-04-2020 2020-04-16T03:33:47.750Z - 2020-04-16T03:46:46.833Z - 16-04-2020

ఆరెండు జిల్లాల మధ్య రాకపోకలు బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ బాగా వ్యాపించడం, కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించింది. రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసింది. సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లు  ఏర్పాటు చేసిన రెండు జిల్లాల పోలీసులు లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. పులిగడ్డ పెనుమూడి వారధి వద్ద రెండు జిల్లాల వైపు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్నారు అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె  (గుంటూరు జిల్లా) పోలీసులు.

అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను బంద్ చేశారు అధికారులు. ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిషేధం విధించాల్సి వచ్చింది. రెండు జిల్లాల వైపు రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులను కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. 

గుంటూరు నగరంతోపాటు, పలు ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం  అధికారులను అప్రమత్తం చేసింది. తాజాగా బుధవారం తాడేపల్లి, పెదకాకాని మండలం ఉప్పలపాడు, గుంటూరు నగరం, దాచేపల్లిలో కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు.ప్రైమరీ కాంటాక్ట్‌ దశ నుంచి జిల్లాలో సెకండరీ కాంటాక్ట్‌ దశకు చేరుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్టుగా ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 

గుంటూరు జిల్లాలో తాజాగా నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 122కి చేరింది. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో కొత్తగా ఓ పాజిటివ్‌ కేసు నమోదైంది. పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఓ టిఫిన్‌ సెంటర్‌ నడిపే వ్యాపారికి కరోనా సోకింది. దాచేపల్లిలో కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాడేపల్లిలో కొత్తగా ఓ కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. గుంటూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90కు చేరాయి. బుధవారం నమోదైన ఎనిమిది కేసుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

ఇటు క్వారంటైన్‌ కేంద్రాల్లో  ఉన్నవారు సరైన భోజనం అందడం లేదని ఆందోళన చేస్తున్నారు. వీరికి మంచి భోజనం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తేల్చారు. అక్షయ పాత్ర భోజనం కొంత మందికి రుచించకపోవడంతో దాని స్థానంలో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీల ద్వారా అన్నం వండించి క్వారంటైన్‌ సెంటర్‌లకు పంపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో రాపిడ్‌గా కరోనా టెస్ట్‌లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.   

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle