newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఆరు నూరైనా క‌ల‌వ‌నివ్వ‌రా..?

18-10-201918-10-2019 12:34:37 IST
Updated On 18-10-2019 14:47:01 ISTUpdated On 18-10-20192019-10-18T07:04:37.470Z18-10-2019 2019-10-18T07:04:33.584Z - 2019-10-18T09:17:01.371Z - 18-10-2019

ఆరు నూరైనా క‌ల‌వ‌నివ్వ‌రా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో నైరాశ్యం మొద‌లైంది. ఇక‌, టీడీపీ రాష్ట్రంలో మ‌ళ్లీ బ‌ల‌ప‌డుతుందా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉండ‌టం, రాష్ట్రంలో, కేంద్రంలో అధికార పార్టీలు టీడీపీకి వ్య‌తిరేకంగా ఉండ‌టంతో తెలుగు త‌మ్ముళ్లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెంగ పెట్టుకున్నారు. ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు.

అవ‌కాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేదా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి, ఎమ్మెల్సీగా ఉన్న అన్నం స‌తీష్ వంటి వారు బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వంటి వారు లైన్‌లో ఉన్నారు.

ఇక‌, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్‌తో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీలో చేరారు. వైసీపీ కూడా త‌లుపులు తెర‌వ‌డంతో మ‌రికొంద‌రు నేత‌లు సైతం వైసీపీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే ఇంకా చాలా మంది నేత‌లు టీడీపీని వీడే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ ఎక్కువ‌గా ఆస‌క్తితో ఉంది. చేరిక‌ల ద్వారా ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

దీంతో ప‌రిస్థితిని అర్థం చేసుకున్న చంద్ర‌బాబు మ‌ళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారు. గ‌తంలో తాను బీజేపీని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని విమ‌ర్శించ‌డాన్ని, బీజేపీకి దూరం కావ‌డాన్ని ఆయ‌న త‌న త‌ప్పుగా భావిస్తున్నారు. బీజేపీతో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి ఇబ్బందులూ లేవ‌ని చెబుతున్నారు. ఇదే కాకుండా పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో, పార్టీ వీడాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న నేత‌ల‌కు మ‌రో సిగ్న‌ల్స్ కూడా వెళుతున్న‌ట్లు స‌మాచారం. మ‌ళ్లీ బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని, నేత‌లెవ‌రూ తొంద‌ర‌ప‌డి పార్టీ వీడొద్ద‌ని కోరుతున్నారు.

దీంతో బీజేపీలోకి చేరిక‌ల‌కు బ్రేక్ ప‌డింది. విష‌యం అర్థం చేసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఇంఛార్జి సునీల్ డియోధ‌ర్ చంద్ర‌బాబు వ్యూహాల‌ను చేదించే ప‌నిలో ప‌డ్డారు. మ‌ళ్లీ ఎట్టి ప‌రిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని, ఇది చంద్ర‌బాబు, అమిత్ షా మాట‌గా చెబుతున్నారు. త‌మ పార్టీలో చేరాల‌నుకునే నేత‌లు చేరిపోవాల‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబుకు స‌న్నిహిత వ్య‌క్తిగా ముద్ర‌ప‌డి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి మాత్రం టీడీపీ త‌న‌ను కోరితే బీజేపీతో చ‌ర్చ‌ల కోసం తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాన‌ని చెబుతున్నారు.

ఇక‌, గ‌తంలో టీడీపీని బీజేపీకి దూర‌మ‌య్యేలా రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించిన వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. మ‌ళ్లీ బీజేపీ - టీడీపీ క‌లిస్తే త‌మ‌కు ప్ర‌మాద‌మ‌ని ఆ పార్టీ గుర్తించిన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించిన విష‌యాల‌ను వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇదే ప‌నిలో ఉన్నాయి.

మొత్తంగా, త‌మ పార్టీ నేత‌లు చేజార‌కుండా చూసుకునేందుకు టీడీపీ, పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు బీజేపీ, మ‌ళ్లీ టీడీపీ - బీజేపీ క‌ల‌వ‌కుండా ఉండేందుకు వైసీపీ ఎవ‌రి వ్యూహాలు వారు ర‌చిస్తున్నారు. అయితే, ఈసారి మ‌ళ్లీ టీడీపీతో బీజేపీ క‌ల‌వ‌డం మాత్రం అంత ఈజీగా క‌నిపించ‌డం లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle