ఆరునెలల జగన్ పాలనపై పవన్ ట్వీట్ల యుద్ధం
23-11-201923-11-2019 15:18:48 IST
Updated On 23-11-2019 17:32:32 ISTUpdated On 23-11-20192019-11-23T09:48:48.610Z23-11-2019 2019-11-23T09:40:55.195Z - 2019-11-23T12:02:32.378Z - 23-11-2019

ఏపీ రాజకీయాల్లో జగన్ ఒక వైపు, టీడీపీ, జనసేన, బీజేపీ మరో వైపు అన్నట్టుగా ఉంది సీన్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై విపక్షాల తమదైన రీతిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ ఆరునెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ పాలనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ఆరునెలల పాలనపై ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేశారు.


సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించే పవన్.. తెలుగులో ట్వీట్లు చేస్తూ.. జగన్ పరిపాలనను ఎద్దేవా చేశారు. ఆరు నెలల పాలనపై ఆరు ముక్కల్లో అంటూ.. ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
జగన్ పాలనలో విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ తొలి ట్వీట్ చేశారు. అనంతరం ఆ ఆరు పదాలకు ఒక్కో ట్వీట్ చేస్తూ వివరణ ఇవ్వడం విశేషం.
జగన్ ఇంగ్లీష్ మీడియంకి జై కొట్టిన సంగతి తెలిసిందే. సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించాలని నిర్ణయం తీసుకోవడంతో.. తెలుగును బతికించాలంటూ.. ట్విట్టర్ వేదికగా యుద్ధం ప్రారంభించారు. మన నుడి-మన నది అంటూ వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడయో వైరల్ అయింది. పవన్ చేసిన ట్వీట్లు గంటల వ్యవధిలోనే జనంలోకి వెళ్లిపోతున్నాయి.

తెలుగు భాష విచ్చిన్నం జరుగుతోందని, ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతకి శ్రీకారం చుట్టారని పవన్ మండిపడ్డారు.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
9 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా