newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఆయ‌న‌పై జ‌గ‌న్ కోపానికి కార‌ణ‌మేంటి..?

27-09-201927-09-2019 06:30:45 IST
Updated On 27-09-2019 16:26:55 ISTUpdated On 27-09-20192019-09-27T01:00:45.017Z27-09-2019 2019-09-27T01:00:38.613Z - 2019-09-27T10:56:55.984Z - 27-09-2019

ఆయ‌న‌పై జ‌గ‌న్ కోపానికి కార‌ణ‌మేంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజాయితీ క‌లిగిన అధికారిగా పేరున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును బ‌దిలీ చేయ‌డం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అతి కూడా అత్యంత కీల‌క స‌మ‌యంలో ఆయ‌న‌ను ఆక‌స్మికంగా బ‌దిలీ చేయ‌డం వెనుక కార‌ణాలేంట‌నేది ఇప్పుడు రాజ‌కీయ అంశంగా మారింది. ప్ర‌భుత్వ పెద్దలు చెప్పిన‌ట్లు న‌డుచుకోక‌పోవ‌డ‌మే సురేంద్ర బాబు బ‌దిలీకి కార‌ణ‌మ‌ని ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది.

1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సురేంద్ర‌బాబు మొన్న‌టి వ‌ర‌కు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఆయ‌న‌కు మంచి పేరుంది. ఉద్యోగుల‌తోనూ ఆయ‌న బాగుంటారు. అయితే, అంతా బాగానే ఉన్నా ఉన్న‌ఫ‌లంగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఆయ‌న‌పై కోపం వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను బ‌దిలీ చేసి ఈ బాధ్య‌త‌ల‌ను ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కృష్ణ‌బాబుకు ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఆర్టీసీకి సంబంధించి ఇది కీల‌క‌మైన స‌మ‌యం. ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో సురేంద్ర బాబును ఎందుకు ఆక‌స్మికంగా బ‌దిలీ చేశార‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే, ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను అద్దెకు తీసుకునే వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వ పెద్ద‌ల మాట సురేంద్ర బాబు విన‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఓ పత్రిక వార్త‌ను ప్ర‌చురించింది.

ఈ వార్త‌లోని అంశాల‌నే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు కూడా ఆరోపించారు. పోల‌వ‌రం కాంట్రాక్టు రివ‌ర్స్ టెండరింగ్‌కు వెళుతున్న జ‌గ‌న్ స‌ర్కార్ ప‌నుల‌ను మెఘా సంస్థ‌కు అప్ప‌గించ‌బోతోంద‌ని, ఇక్క‌డ న‌ష్ట‌పోతున్న డ‌బ్బుల‌ను మెఘా సంస్థ నుంచి ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను అద్దెకు తీసుకోవ‌డం ద్వారా ప్ర‌భుత్వం లాభం చేకూరుస్తుంద‌నేది టీడీపీ వాద‌న‌. ఇది క్విడ్ ప్రోకో అని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల మాట విన‌నందునే నిజాయితీ గ‌త సురేంద్ర బాబును బ‌దిలీ చేశార‌నేది వారి వాద‌న‌.

అయితే, ప్ర‌భుత్వం వైపు నుంచి గానీ, వైసీపీ నుంచి గానీ ఈ అంశంపై ఎటువంటి వివ‌ర‌ణ రావ‌డం లేదు. బ‌దిలీకి కార‌ణాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. అయితే, సురేంద్ర బాబు ప‌ట్ల ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొంత అసంతృప్తిగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు సిద్ధ‌మ‌వ‌డం, తిరుమ‌ల బ‌స్సు టిక్కెట్ల‌పై అన్య‌మ‌త ప్ర‌చారం వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డినా సురేంద్ర బాబు పట్టించుకోలేద‌ని, ఆ కార‌ణాల‌తోనే బ‌దిలీ చేశార‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

కానీ, ఇవ‌న్నీ తాజాగా జ‌రిగిన వ్య‌వ‌హారాలు కాదు. పైగా అధికారంలోకి రాగానే టీడీపీ హ‌యాంలో నియ‌మితులైన అధికారుల‌ను చాలావ‌ర‌కు బ‌దిలీ చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం సురేంద్ర బాబును మాత్రం ఆర్టీసీ ఎండీగా కొన‌సాగించింది. కాబ‌ట్టి, సురేంద్ర బాబు ఆకస్మిక బ‌దిలీ వెనుక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కోపం వ‌చ్చే బ‌ల‌మైన కార‌ణం ఏదో ఉంద‌నేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle