newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఆయన రూటే సపరేటు

05-02-201905-02-2019 16:08:03 IST
2019-02-05T10:38:03.320Z05-02-2019 2019-02-05T10:15:21.584Z - - 17-07-2019

ఆయన రూటే సపరేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ తగ్గిపోతోందా? ఎవరి దారిలో వారు నడుస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఆపార్టీ నేతలు. ఈమధ్యకాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎంపీ టీజీ వెంకటేష్ జనసేన పార్టీతో పొత్తు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాబు చేత చీవాట్లు తిన్నారు. ఇప్పుడు మరో ఎంపీ జేసీ వంతు వచ్చినట్టుంది. ముందునుంచీ జేసీ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కొండొకచో చంద్రబాబుని ఇరుకున పెట్టే మాటలు కూడా మాట్లాడుతుంటారు. ఢిల్లీలో జేసీ నోటికి పని చెప్పారు. దేశాన్ని మార్చడం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చేతకాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం... మంగళవారం జంతర్‌మంతర్‌ దగ్గర ఎంపీ మాగంటి బాబు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలన్న చంద్రబాబు కోరిక ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశతో రాహుల్‌ వెంట చంద్రబాబు తిరుగుతున్నారని చెప్పారు. 

ఇంతకుముందే పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కేంద్ర వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు గాలి తీసేశారు జేసీ. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయడం వల్ల ఉపయోగం ఉండదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏదో ప్రయత్నం చేయాలని చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఢిల్లీలో జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రధాని నరేంద్రమోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. రైల్వేజోన్‌ వల్ల ఏపీకి లాభం ఏమీ కలగదన్నారు. రైల్వే జోన్ కేటాయింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టంలేదని అన్నారు. కక్ష సాధించడం కోసమే కేంద్రం రైల్వేజోన్‌ ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు.

ఏపీలో చంద్రబాబు పాలనలో ఉన్నంత వరకు ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు. గతంలో ఎంపీ సీఎం రమేష్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసినప్పుడు కూడా జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీనేతలకు చుక్కలు చూపించారు. ఈ రకమైన దీక్షల వల్ల  కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు  కేంద్రం ముందుకు రాదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీక్షల వల్ల ఉక్కు రాదు, తుక్కు రాదని జేసీ వ్యాఖ్యానించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన రూట్ సపరేటు అంటున్నారు తెలుగుదేశం నేతలు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle