newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ఆయన ఎవరి మాటా వినని సీతయ్య...స్పీకర్ తమ్మినేని!

30-11-201930-11-2019 14:39:12 IST
Updated On 30-11-2019 16:50:14 ISTUpdated On 30-11-20192019-11-30T09:09:12.347Z30-11-2019 2019-11-30T09:09:08.061Z - 2019-11-30T11:20:14.367Z - 30-11-2019

ఆయన ఎవరి మాటా వినని సీతయ్య...స్పీకర్ తమ్మినేని!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఏపీ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆరునెలలకు ముందు ఎక్కడో ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని స్పీకర్ అయ్యాక ఏపీ ప్రజలందరికీ దగ్గరగా కనిపించారు. ఇక అసెంబ్లీ తొలిసమావేశాలలో స్పీకర్ స్థానంలోనే నిద్రపోయిన ఈ సాబ్ అక్కడ నుండి అప్పుడప్పుడు ఫక్తు రాజకీయకారిగా మాటల దాడికి దిగుతుండే సంగతి తెల్సిందే.

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల మాదిరే మీడియా ముందుకొచ్చి మైకు అందుకుంటే తాను స్పీకర్ ను అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రతిపక్షాలపై విరుచుకుపడే నైజం కూడా ఈయన సొంతం. ఇది చాలదన్నట్లు ఈమధ్య మంత్రులతో సహా వైసీపీ నేతలు కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిన బూతు పురాణంలో కూడా స్పీకర్ గారు గట్టిగానే పోటీ ఇచ్చారు. నాలుగైదు రోజుల క్రితమే సోనియా గాంధీ.. చంద్రబాబులను విమర్శించే క్రమంలో ఇక్కడ రాసుకోలేని బూతులతో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఒక రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి.. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు.. అందరు శాసన సభ్యులకు న్యాయం చేయాల్సిన మీరు ఈవిధంగా రాజకీయాలను మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే.. ముందు నేను ఆముదాలవలస ఎమ్మెల్యేను ఆ తరవాతే స్పీకర్ ను అని సమాధానమిస్తారు తమ్మినేని సీతారాం. అలాంటి ఆయన అధికారులతో ఎలా ఉంటారో మనం ఊహించుకోవచ్చు.

తాజాగా స్పీకర్ తమ్మినేని అధికారులను ఇష్టం వచ్చినట్లు చేస్తే స్పాట్ కొచ్చి కొడతా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా అధికారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమ్మినేనికి అధికారులు అధికారికంగా ఆహ్వానం పంపకపోయినా అయన మాత్రం హాజరయ్యారు.

అయితే కార్యక్రమానికి వచ్చీ రాగానే అధికారులపై విరుచుకుపడ్డారు. మరోసారి ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగితే స్పాట్ కొచ్చి కొట్టేస్తానని వార్నింగ్స్ ఇచ్చారట. అయితే అధికారులు మాత్రం యూనివర్సిటీలో గవర్నర్ ప్రోగ్రాం ఉంది కనుక అంతా బిజీగా ఉంటారని తామెవరినీ పిలవలేదని.. స్పీకర్ వస్తారని అనుకోలేదని.. కానీ వచ్చి ఇలా కొట్టేస్తామని మాట్లాడడం సమంజసంగా లేదని వాపోతున్నారు.

కనీసం సమాధానం కూడా తెలుసుకోకుండా వార్నింగ్స్ ఇవ్వడంతో తెగ ఫీలైపోతున్నారట. అయితే ఎవ్వరి మాట వినని సీతయ్య మాదిరి తమ్మినేని కూడా ఆగ్రహం వస్తే నోటికి ఎంతదైనా రానీ పేల్చేయడమే ఆయనకు తెలిసింది. అయినా పెద్దపెద్ద వాళ్లనే పెద్ద పెద్ద మాటాలన్న స్పీకర్ గారికి అధికారులు ఇంకెలా కనిపిస్తారు.. ఇంకెన్ని అనగలరు.. తప్పదు భరించాల్సిందే!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle