newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఆయనెవరు? గవర్నరా, ముఖ్యమంత్రా, మంత్రా, సీఎస్సా?

04-07-201904-07-2019 15:04:37 IST
Updated On 04-07-2019 16:35:06 ISTUpdated On 04-07-20192019-07-04T09:34:37.540Z04-07-2019 2019-07-04T09:34:35.672Z - 2019-07-04T11:05:06.884Z - 04-07-2019

ఆయనెవరు? గవర్నరా, ముఖ్యమంత్రా, మంత్రా, సీఎస్సా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో అన్ని రోడ్లు విశాఖ శారదాపీఠం వైపు దారి చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు.. వీఐపీలు..  స్వరూపానందేంద్రస్వామి సేవలో తరిస్తున్నారు. ఆయన ఆశీర్వచనాలు,ఆలింగనాలు, నుదుటిమీద ముద్దుల కోసం పరి తపిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు వివిధ సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ల వారు కూడా స్వామివారి పాదాలకు మొక్కుతున్నారు. మీరే దిక్కంటూ ప్రణామాలు చేస్తున్నారు. ఏపీలోని రేషన్ డీలర్లందరూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపాంద వద్దకు వెళ్ళారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏపీలో ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 

రేషన్ డీలర్లు విశాఖ శారదాపీఠం వైపు వెళ్ళడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం అయ్యాక జగన్ ఈమధ్య గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్లే ఇకనుంచి రేషన్ సరుకులు కూడా డోర్ డెలివరీ చేస్తారని ప్రకటించారు. దీంతో రేషన్ డీలర్ల వ్యవస్థ కనుమరుగు కావడం ఖాయమని, తమ ఉపాధికి గండిపడినట్టేనని రేషన్ డీలర్లు భావించారు. ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వరూపానందను కలిసి తమ కష్టనష్టాల గురించి విన్నవించుకున్నారు. అసలు స్వామి ఎవరు? ఆయన మన రాష్ట్రానికి గవర్నరా? ముఖ్యమంత్రా? మంత్రా.? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? అసలు ఒక పీఠాధిపతి అన్ని రాజ్యాంగబద్ధ అధికార పీఠాలను కదిలించే శక్తి ఎలా సంపాదించారు. 

ప్రభుత్వ నిర్ణయాలను సైతం పీఠాధిపతులు శాసించగలరా? ఒక పీఠాధిపతి ఇలా రేషన్ డీలర్లను తనను కలిసే అవకాశం ఇవ్వవచ్చా? ఇచ్చారనుకుంటే తమ సమస్యల పరిష్కారం కోసం స్వామిజీని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వాధిపతులను, మంత్రులను కలవడం ఒక పద్ధతి. వాటిపై ఫిర్యాదులు, సూచలను చేయవచ్చు. కానీ రేషన్ డీలర్లు వెళ్ళి శారదాపీఠాధిపతిని కలవడం ఎంతవరకూ సమంజసం. పరిపాలనలో ఆయన జోక్యం చేసుకుని, రేషన్ డీలర్లకు అన్యాయం జరగకుండా కాపాడగలరా? ఇంత చిన్న విషయాన్ని స్వామీజీ మరిచారా? లేక తమ పీఠాధిపతిని ఎవరైనా కలవవచ్చు, తమ సమస్యలు విన్నవించుకోవచ్చని స్వామీజీ శిష్యులు భావిస్తున్నారా? 

రేపు ఏ అక్రమ నిర్మాణాలు చేసిన బిల్డర్లో, పారిశ్రామిక వేత్తలో కూడా స్వామీజీని కలిసి న్యాయం చేయమంటే స్వామీజీ వారికి కూడా అభయం ఇచ్చేస్తారా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజాదర్భార్ నిర్వహిస్తానని ప్రకటించారు. ఇప్పుడు అదే ప్రజదర్భార్‌కు విశాఖ శారదాపీఠం వేదికయితే ఏం చేయాలి? రాష్ట్ర పరిపాలన అమరావతితో పాటు విశాఖకు కూడా వికేంద్రకరించారని భావించాలా? ప్రజల కింకర్తవ్యం ఏంటి? చివరకు మన రాష్ట్ర పరిస్థితి ఇలా తయాయిందంటూ కొందరు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ శారాదా పీఠం పార్లల్ పవర్ సెంటర్ గా మారుతోందా అని రాజకీయవర్గాలలో చర్చ మొదలయ్యింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle