newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఆయనిప్పుడు సీఎం.. ఆదమరిస్తే ఏమైనా ఉందా?!

02-10-201902-10-2019 09:05:33 IST
2019-10-02T03:35:33.772Z02-10-2019 2019-10-02T03:35:29.373Z - - 05-08-2020

ఆయనిప్పుడు సీఎం.. ఆదమరిస్తే ఏమైనా ఉందా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేనిప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని.. రాష్ట్ర విభజన అనంతరం నా రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. గత ప్రభ్హుత్వం అవలంభించిన విధానాల వలన రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక, రెవెన్యూ పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం.. ఈసమయంలో నేను ప్రజాసమస్యలను పక్కనపెట్టి ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా అమరావతి నుండి హైదరాబాద్ వచ్చి సిబిఐ కోర్టులో హాజరుకావడం నా రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. కాబట్టి వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపునిస్తే నా తరపున మా లాయర్ మిగతా వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అభియోగాలు ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ సిబిఐ కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్ సారాంశం.

పిటిషన్ పై విచారణ చేసిన సిబిఐ కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడానికి సిబిఐకి ఉన్న అభ్యంతరాలను తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదంతా గత నెలలో జరిగిన వ్యవహారం. కాగా నిన్న ఈ కేసులో సిబిఐ కోర్టులో పేజీలకొద్దీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కుమారుడిగా.. ఎంపీగా ఉన్నప్పుడే అన్ని అభియోగాలుంటే ఇప్పుడు ఆయనే ప్రభుత్వాధినేతగా ఉన్నారని మరిన్ని చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేసింది.

జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే బయట ఉన్న సాక్షులను ప్రభావితం చేశారని.. మరి ఇప్పుడు అధికారంలో ఉండగా ఎందుకు చేయరని అనుమానం వ్యక్తం చేసింది. గతంలో దేశఆర్ధిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసేంత భారీ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయని సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొన్నదని గుర్తుచేసిన సిబిఐ జగన్మోహన్ రెడ్డి అన్ని వాస్తవాలను దాచిపెట్టి తనకి మినహాయింపు కావాలని కోర్టును ఆశ్రయించారని పేర్కొంది.

ఇక అయన చెప్పినట్లు రాష్ట్రంలో గత ప్రభుత్వ పనితీరుకుగానీ.. పునర్విభజనకుగానీ ఈ కేసుకు సంబంధమే లేదని, రాష్ట్ర పరిస్థితులని సాకులు చెప్పి సొంత ప్రయోజనాల కోసం మినహాయింపులు కోరుతున్నారని, ఇప్పుడు ఆయనకున్న సౌకర్యాలలో అమరావతి నుండి హైదరాబాద్ 270 కిమీ ప్రయాణం పెద్ద కష్టమేమీ కాదని.. రెండు రోజులు ప్రయాణమని చెప్పడం కేసును పెద్దది చేసి చెప్పడమేనని.. కాబట్టి ప్రయోజాల దృష్ట్యా ఆయనకు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వకపోవడమే మంచిదని తన అభ్యంతరాలను విపులంగా కౌంటర్లో కోర్టుకు వివరించింది.

రేపు శుక్రవారం సిబిఐ కౌంటర్ పై కోర్టు వాదనలు వినిపించనుండగా మరి జగన్ ఈ కేసును ఎలా ఎదుర్కోనున్నారన్నది ఆసక్తిగా మారింది. మినహాయింపు ఇవ్వని పక్షంలో ప్రతిశుక్రవారం ఎన్ని పనులున్నా అమరావతి నుండి హైదరాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిఉంది. అది ప్రతిపక్షాలకు కొంత బలంగా మారే అవకాశముంది. సాక్షాత్తు ఓ సీఎం ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని.. ఇది మన రాష్ట్ర పరిస్థితి అంటూ ఆడేసుకుంటాయి. కానీ సిబిఐ మాత్రం మినహాయింపు నివ్వడానికి ససేమీరా కాదంటుంది. గట్టిగా మాట్లాడితే అప్పుడు ప్రభావితం చేస్తారనే జైల్లో పెట్టాం.. ఇప్పుడు మినహాయింపునిస్తే ఇంకేమైనా ఉంటుందా?! అంటుంది. మరి వాట్ నెక్స్ట్ జగన్ సర్?!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   2 hours ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   18 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle