newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఆయనతో బాబుకి తలనొప్పులు ‘అనంతం’

19-03-201919-03-2019 08:10:58 IST
2019-03-19T02:40:58.700Z19-03-2019 2019-03-19T02:40:27.115Z - - 25-02-2020

ఆయనతో బాబుకి తలనొప్పులు ‘అనంతం’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఝలక్ ఇచ్చారట ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జే.సీ. దివాకర్ రెడ్డి. ఈసారి అనంతపురం ఎంపీ సీటు నుంచి తన కుమారుడు పవన్ రెడ్డిని బరిలో దింపారు జే.సీ. అయితే ఈ లోక్ సభ సీటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారికి టిక్కెట్ ఇస్తే తన కుమారుడు పోటీ చేయడనీ, ఓడిపోడానికి తాము సిద్ధంగా లేమని చంద్రబాబుతో తెగేసి చెప్పేశారట.

ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి, కల్యాణదుర్గం ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి, గుంతకల్లు ఎంఎల్ఏ జితేందర్ గౌడ్, శింగనమల ఎంఎల్ఏ యామినీ బాల మీద జే.సీ. దివాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ నలుగురిని మార్చాలన్నదే దివాకర్ రెడ్డి ఉద్దేశంగా అర్థం అవుతోంది. ఇప్పుడు జే.సీ. వ్యవహారం చంద్రబాబు ఇబ్బందిగా మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎందుకంటే... జే.సీ. చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తే, సిట్టింగ్ ఎంఎల్ఏలు రెబల్ గా బరిలో దిగుతారు. అది పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. అంతేకాదు... జే.సీ అడిగినట్లు నలుగురిని కాకుండా ఇద్దరిని మారిస్తే ఆయన కొంచెం శాంతిస్తాడని చంద్రబాబు అనుకున్నారట. ఇందుకోసం గుంతకల్లు ఎంఎల్ఏ జితేందర్ గౌడ్, శింగనమల ఎంఎల్ఏ యామినీ బాలకు టిక్కెట్లు ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచించినట్లు తెలుస్తోంది. 

అయితే తమ సీటుకు ఎసరు పెడితే ఊరుకోమని ఇప్పటికే జితేందర్ గౌడ్, యామినీ బాల ప్రకటించారు. అంతేకాదు... గుంతకల్లు, శింగనమల సీట్లలో జే.సీ. దివాకర్ రెడ్డి రికమండ్ చేసిన వ్యక్తులు గెలవడం కష్టమన్న సర్వే రిపోర్టుతో చంద్రబాబు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరిలను టచ్ చేస్తే, వారి వర్గం ఓట్లు అనంతపురం ఎంపీ అభ్యర్థికి పడవు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సవాల్ అవుతోంది. కొసమెరుపు ఏంటంటే... తన మాట వినకపోతే పార్టీకి రిజైన్ చేస్తానని కూడా జే.సీ. దివాకర్ రెడ్డి తన వర్గానికి చెప్పినట్లు చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. అందుకు ఇప్పుడేం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle