newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

‘‘ఆయనకి మించిన ప్యాకేజ్ స్టార్ లేడు’’

21-01-202021-01-2020 15:27:47 IST
Updated On 22-01-2020 12:00:42 ISTUpdated On 22-01-20202020-01-21T09:57:47.941Z21-01-2020 2020-01-21T09:47:11.735Z - 2020-01-22T06:30:42.630Z - 22-01-2020

‘‘ఆయనకి మించిన ప్యాకేజ్ స్టార్ లేడు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. పవన్‌తో పొత్తంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని ఎద్దేవా చేశారు. పవన్‌ను పొత్తుల కల్యాణ్, ప్యాకేజీ కల్యాణ్ అంటున్నారని, ఒక పార్టీ అధినేత రెండు చోట్ల పోటీచేసి ఓడిపోవడం చరిత్రలో లేదన్నారు. ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని రోజుకో పార్టీతో పొత్తులు పెట్టుకొని పవన్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

బీజేపీ పెద్దలు ఎందుకు ఇలాంటి వారితో కలిసి పనిచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడం కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదడం లాంటిదన్నారు రోజా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రోజుకో పార్టీతో తిరిగేనేతకు విశ్వసనీయత ఎక్కడ ఉంటుందన్నారు.

మొన్నటివరకూ బీజేపీని తిట్టి ఇప్పుడు ఆ పార్టీ చెంతకే చేరడం ఏంటన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతల తీరుని రోజా విమర్శించారు. అసెంబ్లీ రెండవ రోజు సమావేశాల్ని కూడా ప్రతిపక్ష టీడీపీ పదే పదే అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈరోజు సమావేశాల్లో ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే.. దానికి టీడీపీ అడ్డుపడటం దారుణమన్నారు. మహిళలపై టీడీపీ సభ్యులు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, అసలు వారికి జ్ఞానం ఉందా అని రోజా తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్‌ దేశ చరిత్రలోనే లేడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నమాటను ఆమె గుర్తుచేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle